Dream : ఇవి కలలో కనిపిస్తున్నాయా..?మీ పంట పండినట్లే…కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!

సాధారణంగా ప్రతిమనిషికి ఏదోక కల అనేది వస్తుంది. అయితే కొందరికి గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కానీ కొందరికి మాత్రం కలలో కనిపించిన వస్తువులు కానీ...మనుషులు కానీ...ఏవైనా పనులు కానీ...నిజ జీవితంలో నిజాలు అవుతుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Woman Bed Dream Sleep Preview (1)

Woman Bed Dream Sleep Preview (1)

సాధారణంగా ప్రతిమనిషికి ఏదోక కల అనేది వస్తుంది. అయితే కొందరికి గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కానీ కొందరికి మాత్రం కలలో కనిపించిన వస్తువులు కానీ…మనుషులు కానీ…ఏవైనా పనులు కానీ…నిజ జీవితంలో నిజాలు అవుతుంటాయి.అందులో మంచీ కావచ్చు…చెడు కావచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో కనిపించే వస్తువులు…మీకు రానున్న మంచి చెడుల గురించి సూచనలు ఇస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా మనం కొన్ని రకాల వస్తువులను చూసినట్లయితే కచ్చితంగా ధనవంతులు అయ్యేఅవకాశాలు ఉంటాయి. ఆ వస్తువులేంటో చూద్దాం.

పచ్చని చెట్లు..
మీకు కలలో పచ్చని చెట్లు కనిపించడం… ఆ చెట్ల నుండి పండ్లు కోయడం లాంటివి కనిపించినట్లయితే పూర్వీకుల ఆస్తిని పొందుతారు అని అర్థమట. పచ్చని చెట్లు కనిపించినా మీ పంట పండినట్లే.. త్వరలోనే మీరు కోటీశ్వరులు అవుతున్నారు అనడానికి ఇది ఒక గొప్ప సంకేతం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.

నీటిలో పడడం:
ఒకవేళ మీరు ఉన్నట్టుండి కలలో నీటిలో పడినట్లయితే వ్యాపారంలో చాలా లాభం పొందుతారని అర్థం. లేదంటే మంచి కాంట్రాక్టు వంటి ఇతర లాభాలను కూడా త్వరలో పొందవచ్చు అని అర్ధం . అంతేకాదు ఉద్యోగాలను ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంటుందట.

కొత్త బట్టలు:
మీ కలలో కొత్త బట్టలు ధరించినట్లు కనిపించినట్లయితే మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందని అర్థమట. ఇక అలాగే బట్టలు ఆరబెట్టినట్లు కూడా కల వచ్చిందంటే మీ జీవితంలో ఒక మార్పుకు ఇది చిహ్నంగా పరిగణించవచ్చని చెబుతున్నారు స్వప్న శాస్త్రవేత్తలు.

మృతదేహం:
మీ కలలో ఏదైనా ఒక మృతదేహాన్ని చూసినట్లయితే అది లాభానికి చిహ్నంగా పరిగణించవచ్చట. ముఖ్యంగా కలలో ఇలాంటి సంఘటనలు చూస్తే త్వరలోనే పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నారని అర్థమట.

బావి నుండి నీరు తీయడం:
గతంలో చేదుడు బావులు చాలా ఉండేవి. ఇలా ఎవరైనా సరే చేదుడు బావి నుంచి నీళ్లు బయటకు తోడుతున్నట్లు కలలో వస్తే త్వరలోనే మీరు డబ్బును నిజాయితీగా సంపాదిస్తారు అని అర్థమట,.

 

 

  Last Updated: 02 Jul 2022, 08:56 AM IST