Vastu Tips : ఈ ఐదు వస్తువులలో ఏదైనా ఒకటి ఇంట్లో ఉంచండి…ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. !!

ఇంటికి వాస్తు సరిగ్గా ఉంటేనే..అనుకున్న పనులు జరుగుతాయి. ఇంట్లో ఆనందం, సంతోషం,ఆరోగ్యం ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ప్రతికూల శక్తి లేదా అనుకూల శక్తిని ఇస్తాయి.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 11:19 AM IST

ఇంటికి వాస్తు సరిగ్గా ఉంటేనే..అనుకున్న పనులు జరుగుతాయి. ఇంట్లో ఆనందం, సంతోషం,ఆరోగ్యం ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ప్రతికూల శక్తి లేదా అనుకూల శక్తిని ఇస్తాయి. ఇవి ఒక వ్యక్తి జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. కొన్నిసందర్భాల్లో ప్రతికూల శక్తి వల్ల పనులు జరగవు. ఆటంకాలు ఏర్పడతాయి. అది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టుతాయి. అప్పు తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను సరిచేసుకోవడానికి కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. అయితే వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాం.

తెల్ల పువ్వులు పూసే మొక్క:
ఇంట్లో తెల్లనిపువ్వులు పూసే మొక్కను నాటడం శుభపరిణామంగా భావిస్తారు. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడని…శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైందని నమ్ముతుంటారు. వాస్తు ప్రకారం…ఇంట్లో ఈ మొక్కను నాటినట్లయితే..ఆనందం, శ్రేయస్సుతోపాటు ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రతిరంగంలోనూ విజయం సాధిస్తారు. ఈ మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో కాకుండా ఉత్తర దిశలో నాటండి.

కొబ్బరి:

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఒక కన్ను కొబ్బరిని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరికాయను శుభం, సంతోషం, శాంతికి చిహ్నంగా భావిస్తారు. ఒంటి కన్నుతో కొబ్బరికాయను తెచ్చి, దానికి పసుపు కుంకుమ పూసి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచి నిత్యం పూజ చేయాలి.

శాలిగ్రాం:
శాలిగ్రాంన్ని విష్ణువు అవతారంగా భావిస్తారు. నలుపు రంగులో ఉండే మృదువైన, ఓవల్. శాలిగ్రాం క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఇతర అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

పరాడ్ శివలింగ్:
ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో పూజించాలి. ప్రతిరోజూ ఈ శివలింగాన్ని పూజించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది.

హరిద్రతో చేసిన గణపతి:
హరిద్ర ఒక రకమైన మొక్క. ఈ మొక్క మూలంలో గణేశుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. కాబట్టి, హరిద్ర మూలం లేదా చెట్టు నుండి తయారు చేసిన గణపతిని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి సంపద పెరుగుతుంది.