Marriages Myths : తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా..? ఇందులో నిజమెంత..?

రెండు సుడులు ఉన్నవారికి అదృష్టం బాగా ఉంటుందని అంతేకాకుండా రెండు పెళ్లిళ్లు (Marriages) అవుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 12:50 PM IST

Myths on Marriages : మామూలుగా కొంతమంది ఆడవారికి అలాగే పురుషులకు తలలో రెండు సుడులు ఉంటాయి. ఇలా రెండు సుడులు ఉన్నవారికి అదృష్టం బాగా ఉంటుందని అంతేకాకుండా రెండు పెళ్లిళ్లు (Marriages) అవుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే పల్లెటూర్లలో వారు ఎక్కువగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగానే రెండు సుడులు ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు (Marriages) అవుతాయా? అసలు ఈ రెండు సుడులు ఎందుకు వస్తాయి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

తలలో ఇలా రెండు సుడులు ఉంటే వారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని గ్రామీణ ప్రాంతాల్లో అంటూ ఉంటారు. రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు చేసుకుంటారనేది కేవలం అపోహ మాత్రమే. ఇది ఇప్పటివరకూ రుజువు కాలేదని, కేవలం నమ్మకాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే తలలో రెండు సుడులు ఉన్న వారికి మంచి గుణాలు ఉంటాయట. వారు ప్రేమ, సహాయం, సహనం వంటి లక్షణాలను కలిగి ఉంటారని జోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు గొడవలు, తగాదాలకు దూరంగా ఉంటారట. ఇకపోతే ఈ సుడులు జన్యువుల లోపం కారణంగానే ఇలా వస్తుంటాయి. దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. పురుషులకు కానీ, మహిళలకు కానీ ఇది వారసత్వం నుంచి కూడా వస్తుందట. ఇది కేవలం శరీరంలో ఒక లక్షణం మాత్రమేనని వెల్లడించారు.

రెండు సుడులు ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ రెండు సార్లు పెళ్లి చేసుకుంటారని నమ్ముతారు. లేదంటే ముహూర్తం కుదిరిన తర్వాత చెడిపోయి మరో పెళ్లి చేసుకుంటారని పలు ప్రచారాలు కూడా ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం మాత్రం రెండు సుడులు ఉంటే మంచివారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిసి పోతారని చెబుతున్నారు. కాబట్టి రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయి అన్నది కేవలం అపోహ మాత్రమే. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే అంటున్నారు పండితులు..

Also Read:  Pineapple Pack : చర్మం మిలమిల మెరిసిపోవాలంటే అనాసపండుతో ఇలా ప్యాక్ వేయాల్సిందే..