Site icon HashtagU Telugu

Vaastu : ఏ పని చేసిన కలిసిరావడం లేదా..అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే..!!

Vasthu Tips

Vasthu Tips

జ్యోతిష్యం నమ్మేవారు పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీల గురించి నమ్ముతుంటారు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉండాలనిపిస్తుంది. కానీ నెగెటివ్ ఎనర్జీ ఉన్న ప్రాంతంలో మనం ఎక్కువసేపు గడపలేం. ఏదో తెలియన అశాంతి, మానసిక ఆందోళన ఉంటుంది. అనుకున్న పనులు జరగవు. కానీ మన చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవడం ఎలా. అవును తెలుసుకోవడం సులభం. ఎలాగంటే…కొన్ని సంకేతాలు ద్వారా వీటిని గుర్తించవచ్చు. ఎలాగో చూద్దాం.

1. ఇంటిని శుభ్రంగా ఉంచుకుందామనుకుంటారు. మనం ఎంత శుభ్రంగా ఉన్నా…కొన్నిసార్లు ఒంట్లో నుంచి దుర్వాసన వస్తుంది. అలా దుర్వాసన వస్తుందంటే అక్క డ నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం. కాబట్టి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దుర్వాసన దరిద్రానికి సంకేతం. దానిని తొలగించుకుంటే మీరు అద్రుష్టం దక్కుతుంది.

2. ప్రతివిషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతుంటాయి. అంటే అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం. కాబట్టి ఇంట్లో సమస్యలను కుటుంబ సభ్యులందరూ కూర్చుని పరిష్కరించుకోవాలి.

3. రాత్రిపూట నిద్రపోతాం. కానీ రాత్రిపడుకున్నప్పుడు పీడకలలు వస్తే…ఆలోచించాలి. ఇంట్లో ఏదో తెలియన నెగెటివ్ ఎనర్జీ ఉంది. అందుకే ఇలాంటి కలలు వస్తాయని గుర్తించాలి.

4. డబ్బు సమస్య అనేది సాధారణం. డబ్బు సమస్యకు పరిష్కారం దొరకకుండా ఇబ్బంది పడుతుంటే…ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం.

5. నెగెటివ్ ఎనర్జీ ఉంటే మన ఆలోచనలు కూడా నెగెటివ్ గానే ఉంటాయి. ఎలాంటి సమస్య లేకున్నా సమస్య ఉన్నట్లు ఆలోచనలు రావడం.

6. పని చేస్తున్నప్పుడు నీరసంగా, ఓపిక లేనట్లు ఉండటం.

7. ఇంట్లో ఫ్యామిలీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం. కాబట్టి కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకుని సంతోషంగా ఉండటం గురించి ఆలోచించాలి.