Pooja Vidhan :నవరాత్రుల్లో పూజగదిని ఈ విధంగా అలంకరిస్తే…దుర్గాదేవి సంతోషిస్తుంది…!!

దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 సోమవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తున్నాయి. నవరాత్రుల సమయంలో, దుర్గా దేవి 9 రూపాల్లో కొలువైఉంటుంది.

  • Written By:
  • Updated On - September 19, 2022 / 07:49 AM IST

దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 సోమవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తున్నాయి. నవరాత్రుల సమయంలో, దుర్గా దేవి 9 రూపాల్లో కొలువైఉంటుంది. ఈ తొమ్మిది రూపాల్లో కొలువైన అమ్మవారికి ఎన్నో నియమాలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తారు భక్తులు. తొమ్మిది రోజులపాటు పూజలందుకునే అమ్మవారికి వాస్తు ప్రమాణాలను అనుసరించి పూజగదిని సిద్దం చేసుకోవాలి. ఇలా చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. ఆనందం, సంతోషం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, నవరాత్రులలో దుర్గాదేవికి చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి పూజకు దుర్గాదేవిని ఎలా అలంకరించాలో తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి:
నవరాత్రుల్లో 9 రోజులు ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా సున్నం పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని తయారు చేయండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగడంతోపాటు సానుకూల శక్తిని ఉంటుంది. ఇంటి వాస్తు దోషాల నుండి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

ఈ దిశలో విగ్రహాన్ని ప్రతిష్టించండి:
నవరాత్రులలో ఈశాన్య మూలలో విగ్రహం లేదా కలశాన్ని ప్రతిష్టించాలి. ఈ దిక్కును దేవతాస్థానంగా చెబుతుంటారు. ఈ దిశలో విగ్రహం లేదా కలశం ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దీనివల్ల మనసు పూజలో నిమగ్నమై దోషాలు కూడా తొలగిపోతాయి. మీరు అఖండ దీపం వెలిగిస్తే, దానిని అగ్ని కోణంలో వెలిగించాలి. ఈ దిక్కున అఖండ దీపం వెలిగించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది.

చందనం పీఠాన్ని ఉపయోగించండి;
నవరాత్రుల సమయంలో, దుర్గామాత విగ్రహం లేదా కలశాన్ని ఏర్పాటు చేయడానికి చందనం పీఠాన్ని ఉపయోగించాలి. గంధపు పీఠంపై కలశం విగ్రహాన్నిఉంచాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుంది. అమ్మవారిని పూజించే ప్రదేశం చందనం ప్రభావంతో సానుకూల శక్తిగా మారుతుంది.

పూజించేవారి ముఖం ఈ దిశలో ఉండాలి:
నవరాత్రులలో అమ్మవారిని పూజించేటప్పుడు, పూజ సమయంలో, మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలని గుర్తుంచుకోండి. తూర్పు దిశను బలానికి చిహ్నంగా భావిస్తారు. ఈ దిశకు అధిపతి సూర్యుడు. వాస్తు ప్రకారం, సాయంత్రం ఈ దిశలో దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ఈ రంగును ఉపయోగించండి:
దుర్గాదేవి పూజా స్థలాన్ని అలంకరించడానికి, పూజించడానికి ఎరుపు రంగు, ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించాలి. ఎరుపు రంగు వాస్తు శాస్త్రంలో బలానికి చిహ్నంగా పరిగణిస్తారు. దుర్గాదేవి ఎర్రటి పువ్వులను సమర్పించడం ద్వారా సంతోషిస్తుంది. దీనితోపాటు అమ్మవారికి సంబంధించిన వస్త్రాలు, కుంకుమ, చందనం, చీర, చునారి వంటివి కూడా ఎరుపు రంగులో ఉండాలి.

ఈ రంగుకు దూరంగా ఉండండి:
పూజ సమయంలో ముదురు రంగు, నలుపు రంగును దుస్తువులు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ రంగును ఉపయోగించడం అశుభం. నలుపు రంగు వాడటం వల్ల మనసులో కల్మషం కలుగుతుంది,