Vastu : దీపం ఆరిపోకూడదా..? ఇది చెడుకు సంకేతమా..? గ్రంథాలు ఏం చెబుతున్నాయి.!!

  • Written By:
  • Publish Date - November 17, 2022 / 06:30 PM IST

హిందువులు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగిస్తుంటారు. దీపం వెలిగించిన తర్వాతే హారతి ఇస్తారు. అయితే హారతి సమయంలో దీపం ఆరిపోతే. అది అశుభంగా పరిగణిస్తారు. అయితే దీపాన్ని ఆరిపోవడం అశుభసూచకం కాదు. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. దీపం ఆరిపోవడం గురించి జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

దీపం వెలిగించడం అంటే…జీవితంలో చీకటిని పారద్రోలుతూ వెలుతురుకు స్వాగతం పలకడమని పురాణాలు చెబుతున్నాయి. దీపం జ్వాలాన్ని గ్రంథాల్లో జ్ణాన జ్వాలతో సమానంగా చెబుతారు. శాస్త్రాల ప్రకారం…దీపం వెలిగించడం ద్వారా జీవితంలో వ్యాపించిన చీకటిని నాశనం చేసేదిగా చెబుతారు. దీపం వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సానుకూల ప్రభావాలతోపాటు ప్రతికూల ప్రభావాలు కూడా అన్నాయి. అవేంటంటే…

మనలో చాలామంది దీపం ఆరిపోవడాన్ని చెడుగా భావిస్తారు. ఇలా దీపం ఆరిపోవడంతో భయాందోళనకు గురవుతారు. వాస్తవానికి దీపం ఆరిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. గ్రంథాలలో పేర్కొన్న విధంగా…హారతి సమయంలో దీపం ఆకస్మాత్తుగా ఆరిపోయినట్లయితే…మొదటి కారణం గాలి కావచ్చు. అలాంటి పరిస్థితులను ఓ సారి గమనించాలి. దగ్గర్లో ఫ్యాన్,కూలర్ , లేదా సహజ గాలి అయ్యే అవకాశం ఉంటుంది.

ఇవే కాకుండా మతపరమైన దృక్కోణం నుంచి చూసినట్లయితే దీపం ఆరిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి.
1. పూజసమయంలో దీపం ఆరిపోయినట్లయితే కోరికల నెరవేర్పులు అడ్డంకిగా మారినట్లు అర్థం. పూజ సమయంలో దీపం ఆరిపోవడం దేవత కోపానికి సంకేతం. ఎందుకంటే హారతి ఇచ్చే వ్యక్తి ఏదైనా తప్పు చేసినట్లయితే అలా జరుగుతుంది.
2. మనస్సు పూర్తిగా పూజ నిర్వహించకున్నా..పూజలో ఏదైనా లోపం ఉన్నా పూజ అసంపూర్ణమైనా దీపం ఆరిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు దేవుడిని క్షమించమని కోరాలి. తర్వాత మళ్లీ దీపం వెలిగించాలి. ఇలా చేయడం అశుభం కాదని మతం చెబుతోంది.
3. కొన్ని సందర్భాల్లో దీపం వత్తి సరిగ్గా లేకుంటే కూడా దీపం ఆరిపోవడానికి కారణం కావచ్చు. వత్తి పాతదైనా..నూనెలో సరిగ్గా మగ్గకపోయినా…దీపం ఆరిపోతుంది.

కాబట్టి దీపం ఆరిపోయిందని బాధపడకుండా దేవుడికి మనస్సు పూర్తిగా నమస్కరించి….మన పనులు ప్రారంభించడం మంచిది. దేవుడు ఎప్పుడూ కూడా భక్తుని శ్రేయస్సు కోరుకుంటాడు. హాని తలపెట్టాలని చూడరని గ్రంధాలు చెబుతున్నాయి.