Site icon HashtagU Telugu

Spirtual: ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరిగాయా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?

Spirtual

Spirtual

మామూలుగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా కొన్ని శుభాలు ఆశుభాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ చాలామంది మంచి ముహూర్తాల సమయంలోనే బయటకు వెళ్తూ ఉంటారు. అలాగే ఇలాంటి చిన్న పని చేసినా కూడా వాస్తు ప్రకారం ఆ పనిని ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇకపోతే ఇంటి నుంచి ఈ పని మీద బయటకు వెళ్ళినప్పుడు జరిగే కొన్ని రకాల పనులను శుభం అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే కొన్నింటిని అశుభంగా పరిగణించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు తుమ్మడం అన్నది మంచిది కాదట. అలా మీరు లేదా వేరే ఎవరైనా తుమ్మినప్పుడు ఒక రెండు నిమిషాలు కూర్చొని నీరు తాగి వెళ్లడం మంచిదని చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇలా తుమ్మడం మంచిది కాదట. అయితే అనారోగ్య పరిస్థితుల రీత్యా తుమ్ములు వస్తే పర్లేదు కానీ అనుకోకుండా తుమ్ము రావడం అన్నది మంచిది కాదని చెబుతున్నారు. అలాగే పెళ్లిచూపులు వంటి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు అద్దం పగిలిపోతే మన ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తుతాయని అర్ధం అంటున్నారు పండితులు. అందుకే అద్దం పగిలి పోతే కనుక కాసేపు కూర్చొని హనుమంతుడిని పూజించి తిరిగి వెళ్లాలని ఇలా చేయడం వల్ల ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవు అని పండితులు చెబుతున్నారు.

ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాళీ బకెట్ ను చూడడం కూడా అశుభంగా పరిగణించాలట. ఒకవేళ అలా చుస్తే కాసేపు ఆగి విఘ్నేశ్వరుని పూజించి ప్రార్థించి బయటికి వెళ్లడం మంచిదట. అలాగే కొన్ని సందర్భాలలో పొరపాటున పాలు చేయి జారి కింద పడిపోతూ ఉంటాయి. అలా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పాలు చేయిజారి కింద పడిపోతే కొద్దిసేపు ఆగి పార్వతి దేవిని పూజించి ఆ తర్వాత బయటకు వెళ్లడం వల్ల మీరు చేపట్టిన పనులలో విజయం సాధించవచ్చని చెబుతున్నారు. అలాగే ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కత్తి,ఇనుము లాంటివి కింద పడితే బయటకి వెళ్ళకూడదట. వెంటనే హనుమంతుని పూజించి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచదని దీనివల్ల వెళ్లే పని సక్రమంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇక మనం బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతారు అలాంటప్పుడు కూడా బయటకు వెళ్లకుండా కాసేపాగి ఇంట్లో కూర్చుని వెళ్లడం మంచిదట. అందుకే మన ఇంట్లోని పెద్దలు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకూడదని అంటూ ఉంటారు.