Site icon HashtagU Telugu

Lizard: శరీరంలో ఆ భాగాల్లో బల్లి పడితే ఐశ్వర్యం సిద్ధిస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 01 Feb 2024 01 22 Pm 1399

Mixcollage 01 Feb 2024 01 22 Pm 1399

మామూలుగా మనకు ఇండ్లు ఇంటి వాతావరణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా బల్లులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇంటి పైకప్పు ప్రాంతంలో ఉన్న బుల్లులు అనుకోకుండా శరీర భాగాలపై పడుతూ ఉంటారు.. ఇంట్లో గోడలు, ఇంటి పై కప్పులపై ఉండే బల్లులు అప్పుడప్పుడు మన శరీరం పై పడుతూ ఉంటాయి. బల్లి శరీరంపై పడితే శరీరంపై బల్లి పడిన భాగాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. సహజంగా శకున శాస్త్రంలో బల్లి శరీర భాగాలపై పడితే అశుభమని భావిస్తారు. కానీ శరీరంలో ఏ భాగం పై బల్లి పడితే శుభప్రదంగా పరిగణించబడుతుంది.

బల్లి పడటం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం..బల్లి కుడి భుజం పై పడితే ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చని, అనుకున్న పనులు అవుతాయట. అదే సమయంలో డబ్బు చేతికి వస్తుందని, ఏ వ్యాపారం చేసినా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బల్లి ముఖం పై పడితే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారని చెబుతున్నారు. బల్లి ముఖం మీద పడటం భోజన తృప్తిని కలిగిస్తుందని చెప్తున్నారు. బల్లి మెడ మీద పడితే శకునశాస్త్రంలో ఇది గౌరవాన్ని పెంచుతుంది. బల్లి ముక్కు పై పడితే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించాలి..

కుడి చెవి పై బల్లి పడితే ఆభరణాలు లభిస్తాయని, ఎడమ చెవి పై పడితే ఆయురారోగ్యాలు ఉంటాయి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నుదుటిపై ఎడమవైపు బల్లి పడితే భవిష్యత్తులో వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. బల్లి కుడి పాదం మీద పడితే ప్రయాణాలు చేయవచ్చని, కుడి పాదం యొక్క అరికాలు బల్లి తాకడం వల్ల సంపద పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.మొత్తంగా బల్లి మీద పెడితే దురదృష్టమే కాదు, పైన పేర్కొన్న కొన్ని శరీర భాగాలపై పడితే అదృష్టం కూడా కలిసి వస్తుందని, ఐశ్వర్యం లభిస్తుందని చెబుతున్నారు. అందుకే బల్లి పడితే ప్రతీది చెడే అని భావించకుండా ఏ శరీర భాగంపై పడితే ఏం జరుగుతుందో శకున శాస్త్రం ద్వారా తెలుసుకోవడం మంచిది.

Exit mobile version