Shani Dev: అలాంటి పనులు చేస్తే చాలు.. శనీశ్వరుడి అనుగ్రహం కలగడం ఖాయం?

నవగ్రహాల్లో ఒకరైన శనీశ్వరుని గురించి మనందరికీ తెలిసిందే. శనీశ్వరుడు పేరు వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. చాలామంది శని దేవుని ఆ

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 09:30 PM IST

నవగ్రహాల్లో ఒకరైన శనీశ్వరుని గురించి మనందరికీ తెలిసిందే. శనీశ్వరుడు పేరు వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. చాలామంది శని దేవుని ఆలయాలకు వెళ్లాలి అన్న శని దేవుని పూజించాలి అన్న భయపడుతూ ఉంటారు. గ్రహాల సంచారం ఆధారంగా ఒక్కొక్కరిపై శనిప్రభావం ఒక్కోలా ఉంటుంది. కానీ కేవలం శని నడుస్తున్నప్పుడే కాదు నిత్యం మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా ఆ ప్రభావం పడుతుంది. మంచి పనులు చేస్తే శని దేవుడు అనుగ్రహం కలిగి ఎంతటి బీదవారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అలాగే చెడు పనులు చేస్తే శని దేవుని ఆగ్రహానికి లోనవ్వడంతో పాటు శని దేవుడు వారిపై కోపగించుకుంటే ఎంతటి కోటీశ్వరులైనా సరే బీదవాడు కావాల్సిందే.

చాలామంది శనీశ్వరుని అనుగ్రహం కలగడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శనీశ్వరుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడంతో పాటు స్వామివారికి కొన్ని సమర్పించడం వల్ల కూడా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. అంతే కాకుండా ఇంకొక పని చేయడం వల్ల కూడా క్షమించమని అనుగ్రహం పొందవచ్చు. మరి ఏం పని చేయాలి అన్న విషయానికి వస్తే.. ఎందుకు పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది. త్రేతాయుగంలో రఘువంశ విఖ్యాతుడు, సప్తద్వీపాలకు అధిపతి అయిన దశరధుడు అనే చక్రవర్తి వున్నాడు. అతడు ఒకనాడు పురోహితులు ఇలా చెప్పగా విన్నాడు. రాజా 12 ఏళ్లు దుర్భిక్షము సంభవించబోవుతున్నది. దీనికి కారణం ప్రస్తుతం కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్న శని, రోహిణిలోకి ప్రవేశించబోతున్నాడు.

దీని పర్యవసానం దేవదానవులకు భయము గొలిపే ఉత్పాతమే అన్నారు. అది విని దశరధ మహారాజు దీని నుండి తప్పించుకునేందుకు ఉపాయం ఏమిటని ప్రశ్నించాడు. వశిష్టాది రుషి ప్రముఖులకు, బ్రహ్మరుద్రాదులకే అది సాధ్యమని చెప్పారు. అది విన్న కోసలాధీశుడు ధనుర్భాణములు ధరించి రథమెక్కి నక్షత్ర మండలానికి సమీపించాడు. ఆయన అలా సూర్యమండలము దాటి దానికి పైనున్న రోహిణిని ప్రవేశించే శనిపై సంహాస్త్రము ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విధంగా క్రోధపూరితుడై వున్న రాజును చూసి శని రౌద్రాకారుడై నవ్వి ఇలా అన్నాడు. ఓ రాజా నీ పౌరుషము భయంకరమైనది. నీకు కావలసినవేమిటో కోరుకో అని అన్నాడు. అప్పుడు దశరధుడు ఇట్లా అన్నాడు. ఇది మొదలు నీవెవ్వరినీ బాధింపకుము. ద్వాదశవర్ష దుర్భిక్షమికపై రాకుండా చేయుము అని అన్నాడు. శని వల్ల వరము పొందినవాడై దశరథుడు శనీశ్వరుడిని ఇలా స్తుతించాడు. అని పరిపరి విధాలుగా శనిని కొన్ని శ్లోకములతో ప్రార్థించాడు. అందుకు శని సంతోషించి రాజా.. నీవిలా స్తుతించినట్లు ఈ కథ విన్నవారికి ఎట్టి బాధలు లేకుండా నేను రక్షిస్తానని చెప్పి అంతర్థానమయ్యాడు.