Hyderabad to Himalayas : హైదరాబాద్ టు హిమాలయాస్.. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అదుర్స్

హిమాలయాలను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. అక్కడికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు.

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 01:42 PM IST

Hyderabad to Himalayas : హిమాలయాలను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. అక్కడికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రత్యేకించి ఎంతోమంది భారతీయులు హిమాలయాలను ఒక టూరిస్టు ప్రదేశంలా కాకుండా పుణ్యస్థలిలా చూస్తారు. హిమాలయాల పరిసరాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడాన్ని గొప్ప భాగ్యంగా భావిస్తారు. అటువంటి వారు నేరుగా మన హైదరాబాద్ నుంచి హిమాలయాలకు వెళ్లేందుకు గొప్ప టూరిస్టు ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ అమలు చేస్తోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

టూర్ ప్యాకేజీ బుకింగ్ ఎలా ?

  • హైదరాబాద్ నుంచి హిమాలయాలను కనెక్ట్ చేసే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ పేరు.. ‘‘రాయల్ నేపాల్ ఎక్స్​ హైదరాబాద్​(Royal Nepal Ex Hyderabad)’’.
  • ఈ టూ‌ర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది.
  • ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా నేపాల్‌లోని ఖాట్మండు, పోఖారా ప్రాంతాలను కవర్ చేస్తారు.
  • నేపాల్ టూర్‌కు వెళ్లాలని భావించే వారికి తప్పనిసరిగా పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ ఉండాలి.
  • ఈ టూర్ ప్యాకేజీలో సింగిల్​ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ.55,630, డబుల్ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ.46,550, ట్రిపుల్​ ఆక్యుపెన్సీ టికెట్ ధర రూ.45,250.
  • 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు విత్ బెడ్ టికెట్ కావాలంటే  రూ.40,110 చెల్లించాలి.
  • 2 నుంచి 11 ఏళ్లలోపు  పిల్లలకు బెడ్ లేకుండా టికెట్ కావాలంటే  రూ.35,190 చెల్లించాలి.
  • పైన మనం చెప్పుకున్న టికెట్ల రేట్ల చెల్లిస్తే.. ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ కవర్ అవుతాయి.

Also Read :USA Vs Pak : పాక్‌కు షాక్.. ఎన్నికలపై దర్యాప్తు కోరుతూ అమెరికా తీర్మానం

టూర్ ఇలా సాగుతుంది.. 

  • ‘‘రాయల్ నేపాల్ ఎక్స్​ హైదరాబాద్’’ టూర్ హైదరాబాద్‌ నుంచే ప్రారంభం అవుతుంది.
  • ఉదయం విమానం ఎక్కితే.. సాయంత్రంకల్లా నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకుంటాం. సాయంత్రంవ వేళ అక్కడి లోకల్ ఏరియాలను మనం చూడొచ్చు. రాత్రి ఖాట్మండులో బస చేస్తాం.
  • టూర్‌లో రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేసుకొని నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం, బుద్ధనాథ స్థూప, పఠాన్, దర్బార్ స్క్వేర్, స్వయంభునాథ్ స్థూపంలను మనం చూస్తాం.
  • రెండో రోజు రాత్రి మనం భోజనం చేసుకొని ఖాట్మండులోనే బస చేస్తాం.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేసుకొని ఖాట్మండు నుంచి పోఖారాకు బయలుదేరుతాం. అక్కడి మనకమన ఆలయం సందర్శిస్తాం. సాయంత్రం స్థానిక ప్రాంతాల్లో షాపింగ్ చేస్తాం. రాత్రికి పోఖారాలోనే మనం బస చేస్తాం.
  • టూర్‌లో భాగంగా నాలుగో రోజు తెల్లవారుజామున మనం పోఖారా నుంచి సూరంగ్‌కోట్‌కు బయలుదేరుతాం. అక్కడ మనం మంచుకొండల్లో అందమైన సూర్యోదయాన్ని చూస్తాం. ఆ తర్వాత స్థానిక ఏరియాల్లో తిరుగుతాం.
  • తదుపరిగా బింధ్యబాసిని మందిర్, డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలను మనం చూస్తాం.
  • నాలుగో రోజు టూర్‌లో భాగంగా మనం రాత్రికి పోఖారలో బస చేస్తాం.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేశాక మనం పోఖార నుంచి ఖాట్మండుకు బయలుదేరుతాం.
  • ఖాట్మండుకు చేరుకున్న తర్వాత అక్కడి హోటల్​లో బస చేస్తాం. అనంతరం అక్కడి స్థానిక ప్రదేశాలను మనం విజిట్ చేస్తాం.
  •  ఐదోరోజు రాత్రి కూడా మనం ఖాట్మండులోనే బస చేస్తాం.
  • ఆరో రోజు ఉదయం మనం బ్రేక్​ఫాస్ట్ చేసుకొని ఖాట్మండు ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటాం.
  • ఖాట్మండు ఎయిర్ పోర్టులో ఉదయం 10:50 గంటలకు ఫ్లైట్​ ఎక్కితే.. ఆ రోజు రాత్రికల్లా మనం హైదరాబాద్‌కు చేరుకుంటాం.