Muslim man Md Siddhik doing Ganesh Navaratri దేశం లో ఎక్కడ ఎలా ఉన్నా హైదరాబాద్ లో కొన్ని చోట్ల మత సామరస్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో హైదరబాద్ లో ఒక ముస్లిం వ్యక్తిఒ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశాడు. రాం నగర్ లో మహ్మద్ సిద్ధుక్ అనే వ్యక్తి గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు తనతో కలిసి ఉండే హిందీ స్నేహితులతో కలిసి నిత్య పూజలు కూడా నిర్వహిస్తున్నాడు. సిద్ధిక్ ఏర్పాటు చేసిన ఈ గణేష్ మండపాన్ని విగ్రహాన్ని చూసేందుకు హిందువుల తో పాటుగా ముస్లింలు కూడా వచ్చి పూజలో పాల్గొంటున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి పండుగ కాగా ఆరోజు తను తయారు చేసిన భారీ విగ్రహాన్ని మహ్మద్ సిద్ధిక్ తన హిందూ స్నేహితులతో కలిసి మండపాన్ని రెడీ చేశాడు (Muslim man Md Siddhik doing Ganesh Navaratri ). అక్కడ భారీ వినాయకుడిని ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రాం నగర్ లోని ఈ మండపం దగ్గర కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లిం లు కొందరు క్రైస్తవులు కూడా పూజలో పాల్గొంటున్నారని తెలుస్తుంది.
సిద్ధిక్ ఈ ఒక్క ఏడాదే కాదు రాం నగర్ లో 18 ఏళ్లుగా తన హిందూ స్నేహితులతో కలిసి గణేష్ వేడుకలు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. వినాయక ప్రతిస్ఠ దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎంతో బాధ్యతగా సిద్ధిక్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలుస్తుంది.
స్నేహితులుల్లో కలిసి సిద్ధిక్ ఈ 9 రోజులు ఈ వేడుకల్లో పాల్గొంటారని.. రంజావ్ వేడూల్లో కూడా హిందూ స్నేహితులు సిద్ధిక్ తో పాటు పండుగ వేడుకల్లో పాల్గొంటారని సిద్ధిక్ తెలిపాడు. ఏ మతం అయినా అంత అన్నదమ్ముళ్ల వలే కలిసి ఉంటామని మతాలకు అతీతంగా పండుగలను కలిసి జరుపుకుంటామని సిద్ధిక్ చెబుతున్నారు.
Also Read : Ram Skanda : ఐదు యాక్షన్ బ్లాక్స్.. సీట్లలో ఎవరు ఉండరా..!