మామూలుగా హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదని అలాగే ఆచారాలు సాంప్రదాయాలు తప్పకుండా పాటించాలని చెబుతుంటారు. అలా తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల దాంపత్య జీవితంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి పై కూడా ప్రభావం పడవచ్చు. ఇకపోతే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే…గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట.
భార్య కోరికలు తీర్చకపోతే దోషము కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చెట్లు నరకడం లేదంటే సముద్ర స్నానం చేయడం లాంటి పనులు అస్సలు చేయకూడదట. భార్య గర్భం దాల్చిన తరువాత అనగా ఆరు నెలల తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదట. అంటే తల వెంట్రుకలను కట్ చేయించుకోవడం మీసాలు గడ్డం చేయించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదట. అదే విధంగా భార్య గర్భిణీ గా ఉన్న సమయంలో భర్తలు పొరపాటున కూడా శవం మోయడం లాంటి పనులు అస్సలు చేయకూడదట. అలాగే భార్య గర్భం ధాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయకూడదట.
భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుండి క్షౌరము, తీర్థయాత్ర, నావ యొక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలనీ చెబుతున్నారు. పర్వతారోహణము, యుద్దము చేయుట వంటివి వాటికి దూరంగా ఉండాలట. ఇంటికి స్తంభ ముహోర్తము గానీ, గ్రుహారంభము కానీ, వాస్తుకర్మ కానీ, చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు పండితులు. అలాగే శవాన్ని అనుసరించి వెళ్ళరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడట. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు కూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.