సాధారణంగా స్త్రీలకు తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. ప్రతి ఒక్క స్త్రీకి తల్లి అవడం అన్నది ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. ప్రతి మహిళలు అమ్మ అనే పిలుపు కోసం పరితప్పిస్తుంటారు. అందుకే పెళ్లి అయిన తర్వాత స్త్రీ గర్భవతి అయితే ఎన్నో రకాల జాగ్రత్తలు విషయాలను పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
మామూలుగా స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆమె తన భర్త ఇద్దరూ కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. అలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకి అరిష్టం అంటారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు. అలాగే చెట్లు నరకడం, మొక్కలకు పురుగుల మందు చల్లడం లాంటివి చేయరాదు. 7 నెలలు నిండిన ప్రసవం అయ్యేవరకూ క్షవరం లేదా గడ్డం చేసుకోకూడదు. శవాలను మోయరాదు. అంతిమ యాత్రల్లో పాల్గోకూడదు. ప్రేత కర్మలు, పిండ ప్రదానాలు వంటివి చేయరాదు. భార్య కడుపుతో ఉందని తెలిసిన తర్వాత తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయకూడదు.
పడవలు ఎక్కడం, పర్వతారోహన చేయడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. అదేవిదంగా శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచి దూరంగా వెళ్లకూడదు. అంటే భర్త పక్కనే ఉండాలా అంటే ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఒకవేళ గర్భవతికి నొప్పులు లాంటివి వచ్చినప్పుడు భర్త పక్కనే ఉండటం వల్ల ఆమెకు కొండంత ధైర్యం ఉంటుంది. అందుకే నెలలు నిండే కొద్ది భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఇటువంటి పనులు చేయకపోవడమే మంచిది. అలా చేయడం వల్ల వాటి ప్రభావాలు కడుపులోని బిడ్డ పై చూపిస్తాయని చాలామంది చెబుతూ ఉంటారు.