Site icon HashtagU Telugu

Char Dham Yatra : ప్రమాదకరంగా చార్ ధామ్ యాత్ర..

Huge Rush Of Devotees Aroun

Huge Rush Of Devotees Aroun

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఆరు నెలల తర్వాత బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్చరణ, డప్పు, నాదస్వర వాయిద్వాల మధ్య బద్రీనాథ్‌ ఆలయ తలుపులను పూజారులు తెరిచారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో యమునోత్రి ధామ్ (Char Dham Yatra) కు వెళ్లే దారిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాట్ రోడ్డులో ప్రమాదకరంగా గంటల తరబడి నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ట్విట్టర్ వేదికగా వాపోతున్నారు. భక్తులను నియంత్రించేందుకు పోలీసులే లేరని, సరైన సదుపాయాలు సైతం ఏర్పాటు చేయలేదని సీఎంకు ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరి అధికారులు , పోలీసులు త్వరగా భక్తులను కంట్రోల్ చేయకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఈ వీడియోస్ చూసిన వారు వాపోతున్నారు. గతంలో బద్రీనాధ్ యాత్రలో ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు విడిచిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్‌, కేదార్ నాథ్‌, యుమునోత్రి, గంగోత్రి ఆలయాలను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

Read Also ; Allu Arjun Campaign: అల్లు అర్జున్‌ ని టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్