Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులు కాస్త ఆలోచించండి..

విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యి రిజల్ట్ రావడం..వేసవి సెలవులు ఉండడం తో పెద్ద ఎత్తున భక్తులు , కుటుంబ సభ్యులు దైవ దర్శనాలు చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు

Published By: HashtagU Telugu Desk
Tirumala

Tirumala

వేసవి సెలవులు (Summer Holidays) వచ్చాయంటే చాలు అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యి రిజల్ట్ రావడం..వేసవి సెలవులు ఉండడం తో పెద్ద ఎత్తున భక్తులు , కుటుంబ సభ్యులు దైవ దర్శనాలు చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. దీంతో అన్ని దేవాలయాలు భక్తులతో నింపొతాయి. ఇక తిరుమల క్షేత్రం గురించి చెప్పాలిన పనిలేదు. మామూలుగానే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వేసవి సెలవులంటే చెప్పాల్సిన పనిలేదు. కలియుగ దైవాన్ని దర్శించుకోవాలంటే దాదాపు 24 గంటలు లైన్లో ఉండాల్సిందే. ప్రస్తుతం తిరుమలలో అదే కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎస్‍ఎస్‍డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా వీకెండ్ లలో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30 నుంచి 40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్‌లలోకి ప్రవేశించే పురుషులతోపాటు మహిళలు, వృద్ధులు, వికలాంగులు సుదీర్ఘ సమయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండక తప్పడం లేదు. అందుకే ఇప్పుడు తిరుమలకు వెళ్లాలని అనుకునే వారు కాస్త అలోచించి వెళ్తే బాగుంటుందని అంటున్నారు.

Read Also : Dog Kabosu : క్రిప్టోకరెన్సీని ప్రేరేపించిన ప్రముఖ కుక్క కబోసు మృతి

  Last Updated: 24 May 2024, 08:52 PM IST