మనం తరచుగా నరదృష్టి అనే మాటను వింటూ ఉంటాం. అంటే ఒకరు బాగా ఎదుగుతున్నప్పుడు బాగా బతుకుతున్నప్పుడు దానిని చూసి ఓర్వలేని వారు దిష్టిపెట్టారని, అలాంటి వారిని చూసి ఓర్వలేకపోవడం వల్ల చూసే చూపుతో ఇలా జరిగే అవకాశాలు ఉంటాయని చెబుతుంటారు. అందుకే నరదృష్టి తగిలింది తీర్చుకోవాలని చెబుతుంటారు. మనకి ఇష్టం లేనివారికి చెడు జరగాలి అనుకుని చూసే చూపు అన్నమాట. ఈ కనుదృష్టి నివారణకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన నివారణోపాయాలు ఉన్నాయి. అన్ని మతాల్లోనూ ఈ కనుదృష్టి దోషం వల్ల కలిగే లక్షణాలు వాటికి తగ్గ విరుగుళ్ళూ పేర్కొన్నారు. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుందట. అలాగే శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుందట. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవట. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి, నరదిష్టి తొలగిపోవాలంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవట. అదే విధంగా ప్రతి అమావాస్య పౌర్ణమి అష్టవి నవమి వంటి మంచి తిధుల్లో ఉదయం లేదని సాయంకాలం సాంబ్రాణి వేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుందట.
పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం పెరుగుతుందట. అలాగే రుణ బాధలు ఉన్నవారు వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే కుల దైవానికి కూడా పూజ చేయాలని చెబుతున్నారు. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే అంతా మంచే జరుగుతుందని మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈతి బాధలు తొలగిపోవాలంటే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిని తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లితే కంటి దుష్టు తొలగిపోతుందట. సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా కూడా శరీరంలో ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.
వ్యాపారం కలిసి రాకపోవడం నష్టాలు రావడం బిజినెస్ సరిగా జరగకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి నిమ్మకాయ వేసి ఉంచాలి. ఈ గ్లాసుని అందరూ వచ్చి వెళ్ళే చోట ఉంచి నీటిని ప్రతి రోజూ మారుస్తూ ఉండాలి. నిమ్మకాయని ప్రతి శనివారం మార్చాలి. నరదిష్టి, కను దిష్టి వల్ల ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నష్టపోతారు. ఒక తెల్లటి బౌల్లో రంగు రంగుల రాళ్ళు లేదా పూసలు వేసి ఉంచితే ఫలితం ఉంటుంది. పుట్టిన పిల్లలని చూడటానికి వచ్చినవాళ్ళు వెళ్ళిన తరువాత అకస్మాత్తుగా అనారోగ్యం కలుగవచ్చు. ఈ దిష్టి పోవాలంటే చేతిలో ఉప్పు వేసుకుని పిలల్ల తల చుట్టూ అటూ ఇటూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వెయ్యాలి. అలాగే హాలులో పశ్చిమ దిశలో ఆక్వేరియం ఉంచితే ఇలాంటి సమస్యలు సమసిపోతాయి.