ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందులో చుండ్రు సమస్య కూడా ఒకటి. చుండ్రు సమస్య అన్నది జుట్టుకు సంబంధించిన సమస్యలు ప్రధాన సమస్యగా మారిపోయింది. స్త్రీ పురుషులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చుండ్రు సమస్య ఉన్నప్పుడు నలుగురికి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ చుండ్రు సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు చుండ్రు సమస్య ఇట్టే తగ్గిపోతుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చుండ్రుతో బాధపడేవారు ముందుగా కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి ఆ నీరు మొత్తం ఆకుపచ్చగా మారేవరకు నీటిని ఉడికించి తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా మన జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకుని ఆ తర్వాత చల్లగా అయినా ఆ వేపాకు నీటితో మన తలని శుభ్రం చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయటం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చట.
అదేవిధంగా వేడి చేసిన వేప నూనెని చల్ల బరిచి అందులో ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆముదం కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ భద్రపరుచుకున్న వేప నూనెని వారానికి రెండుసార్లు తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే తొందరగా చుండ్రు సమస్య తగ్గుతుంది. వేపలో ఉండే విటమిన్ ఈ స్కాల్ప్ ని శుభ్రం చేసి జుత్తుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. అలాగే వేప నూనెలో నింబిడిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది తలలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే సోరియాసిస్ లేదా ఇతర స్కాల్ప్ చికాకుల చికిత్సలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వేప ఒక శిలీంద్రం. కొన్నిసార్లు తలలో ఈస్ట్ పేరుకుపోయి చుండ్రు, చికాకు కలిగించినప్పుడు వేపాకులని ముద్దగా చేసి తలకు పట్టించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.