Theertham: తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేస్తే నష్టాలు తప్పవు.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా?

సాధారణంగా హిందువులు కొబ్బరికాయకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. ఎటువంటి శుభకార్యం

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 09:06 AM IST

సాధారణంగా హిందువులు కొబ్బరికాయకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. ఎటువంటి శుభకార్యం తలపెట్టిన కూడా ముందుగా కొబ్బరికాయ కొట్టి మొదలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లోనూ బయట దేవుళ్లకు పూజలు చేసినప్పుడు కూడా టెంకాయ కొడుతూ ఉంటారు. అయితే టెంకాయ కొట్టిన తర్వాత టెంకాయలో ఉన్న నీళ్లను కూడా పవిత్రంగా భావిస్తారు. అయితే సాధారణంగా హిందువులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూలు పండు దేవుడికి సమర్పించి కొబ్బరికాయను కొట్టి, కోరిన కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆలయంలో పూజ పూర్తి అయిన తర్వాత పూజారి తీర్థాన్ని ఇస్తారు.

అయితే కొన్ని చోట్ల తీర్థం ఇస్తారు మరికొన్ని చోట్ల తులసి నీరు, లేదా అభిషేకం చేసిన నీరు, లేదంటే పంచామృతాన్ని తీర్థంగా ఇస్తారు. అలా వీటిలో ఏదో ఒకటి పూజారి తప్పకుండా భక్తులకు ఇస్తాడు. అయితే ఇలా పూజారి తీర్థం ఇచ్చిన తర్వాత దాన్ని స్వీకరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొన్ని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆ తీర్థాన్ని తాగడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి. అందుకే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు తీర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యిని అలాగే తల మీదకు తీసుకెళ్లి తలకు రుద్దుతూ ఉంటారు. అలా చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. మరి తీర్థం తీసుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తీసుకున్న తరువాత మన చేయి ఎంగిలి చేయి అవుతుంది.

అప్పుడు ఆ ఎంగిలి చేతిని తల మీద పెట్టి రుద్దుకుంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. కొన్నిసార్లు గుడిలో పంచామృతం కూడా వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా కొంతమంది అలవాటులో పొరపాటుగా ఇలా తలకు రుద్దుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఎటువంటి తీర్థం అయినా సరే దానిని తలకి రాసుకోకూడదు. అలా చేయడం వల్ల దరిద్రం పట్టుకోవడంతో, ఫలితాలు ఉండకపోగా గుడికి వెళ్లి కోరిన కోరికలు కూడా నెరవేరవు అని శాస్త్రం చెబుతోంది. అందుకే గుడికి వెళ్ళిన తర్వాత ఆ ఎంగిలి చేతిని నీటితో కడుక్కోవాలి. లేదంటే కండువా లేదంటే కర్చీఫ్ సహాయంతో చేతిని తుడుచుకోవాలి. అంతేకానీ అలా చేతిని తీసుకెళ్లి నెత్తి మీద తుడుచుకోవడం, రుద్దు కోవడం లాంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.