Site icon HashtagU Telugu

Spiritual: నంది చెవిలో కోరికలు చెబుతున్నారా.. అవి శివుడికి చేరాలంటే ఏం చేయాలో తెలుసా?

Spiritual

Spiritual

మామూలుగా మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటాం. అందులో నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శనం చేసుకోవడం ఒకటి అయితే రెండవది నంది చెవిలో కోరికలు చెప్పుకోవడం ఒకటి. ఇలా మంది చెవిలో కోరికలు చెబితే త్వరగా నెరవేరుతాయి అని అవి పరమేశ్వరుడికి చేరతాయని భక్తుల నమ్మకం. అయితే ఇలా నంది చెవిలో కోరికలు చెప్పడం అనేది ఇప్పటి సంప్రదాయం మాత్రమే కాదు పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంప్రదాయం వెనుక ఒక ప్రత్యేక కారణం కూడా ఉందట. ఇక శివపురాణంలో నందిని శివుని అవతారంగా భావిస్తారు.

అందుకు ప్రతి శివాలయం బయట నంది విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. నంది లేని శివాలయం దాదాపుగా ఉండదు. శివాలయానికి వచ్చినప్పుడల్లా నంది చెవిలో తన కోరిక చెప్పుకోవాలి అంటారు పండితులు. ఇలా చేయడం వల్ల కోరికలు త్వరగా నెరవేరే అవకాశం ఉంటుందట. మహాదేవుడు తపస్వి, ఎల్లప్పుడూ సమాధిలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. అందుకే మన మాటలు నేరుగా ఆయనకు చేరవట. శివుడు సమాధి నుంచి లేచిన తర్వాత నందే ఆ కోరికలు మొత్తం శివుడికి చెబుతాడట. నంది శివుని గణాధ్యక్షుడు, శివుని అవతారంగా కూడా నమ్ముతుంటారు. మహాదేవుడు తన చెవిలో చెప్పిన కోరికలను త్వరగా ఆలకిస్తాడని భక్తుల సమస్యలు తీరుస్తాడని నమ్మకం. కాగా ముందుగా శివుడిని, పార్వతిని పూజించాలి. దీని తరువాత నందికి నీరు, పువ్వులు, పాలు అర్పించాలి.

ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించి నందికి హరతి ఇవ్వాలి. నందీశ్వరుడికి ఏ చెవిలోనైనా మీ కోరికలు చెప్పుకోవచ్చు. అయితే ఎడమ చెవిలో కోరికలు చెబితే మంచి ఫలితాలు లభిస్తాయట. నంది చెవిలో మీ కోరికను చెప్పే ముందు ఓం అనే పదాన్ని పలకాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు శివునికి త్వరగా చేరుతాయి అంటున్నారు పండితులు. నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు చెప్పే ఏ కోరిక కూడా ఇతరులు వినకూడదు. లేదంటే మీ కోరిక నెరవేరడం నెమ్మది కావచ్చట. కోరికను చెప్పేటప్పుడు చేతులతో మీ పెదవులను క్లోజ్ చేసుకోవాలి. దీని వల్ల మీ కోరికను చెబుతున్న సమయమలో ఇతర వ్యక్తులకు ఆ కోరిక తెలియదు. మీ కోరిక చెప్పిన తర్వాత నందీశ్వర మా కోరిక తీర్చు అని విజ్ఞప్తి చేయాలి. ఒక సమయంలో ఒక కోరిక మాత్రమే చెప్పాలని చెబుతున్నారు.