Site icon HashtagU Telugu

Spirtual: ఈ అలవాట్లు మిమ్మల్ని కష్టాల పాలు చేస్తాయని మీకు తెలుసా?

Spirtual

Spirtual

మామూలుగా చాలా మంది దేవుడి గదిలో ఒకే దేవుడికి చెందిన దేవతకు చెందిన రెండు మూడు చిత్రపటాలు ఉంచుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు. దేవుడి పూజ గదిలో దేవత లేదా దేవుడికి సంబంధించిన రెండు చిత్రపటాలు అసలు ఉండకూడదట. అలాగే శనివారం రోజు పొరపాటున కూడా ఇంటికి ఆయిల్ తెచ్చుకోకూడదని చెబుతున్నారు. ఇక చాలామంది ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురుని నిలబెట్టుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పుడు కాలితో తొక్కడం లాంటివి చేయకూడదు.

చాలామంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటితోనే కాళ్లు చేతులు కడుక్కోవడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. బట్టలు పిండిన తర్వాత ఆ మురికి నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోకూడదట. సాయంత్రం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు అని చెబుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు లేదా వృద్ధులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగోలేని వారికి కూడా ఈ విషయంలో మినహాయింపు ఉంటుందట. కొందరు సాయంత్రం సమయంలో అనగా సూర్యాస్తమ సమయంలో నిద్ర పోతూ ఉంటారు.

ఇలా చేయడం వల్ల ఇంట్లోకి రావాల్సిన లక్ష్మీదేవి అలిగి అలాగే వెళ్ళిపోతుందట. ఇక ఉదయాన్నే లేవకుండా చాలా సేపు పడుకోకూడదట. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక నిద్ర లేవగానే సమయం లేదు అనే దుప్పటిని మూల విసిరేయడం లేదంటే బెడ్ మీద అలాగే వదిలేయడం లాంటివి చేయకూడదు. దానిని మడిచి పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. అలాగే వంట చేసే ప్రదేశంలో అనగా వంటగదిలో అలాగే పూజగది ప్రదేశంలో తల దువ్వకూడదని చెబుతున్నారు. ఈ విషయాలను తూచే తప్పకుండా పాటించాలని తెలియక చేసే ఈ పొరపాట్లు ఈ అలవాట్ల వల్ల లేనిపోని కష్టాలను అనుభవించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Exit mobile version