Site icon HashtagU Telugu

‎Karthika Masam 2025: కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజు ఇలా పూజ చేస్తే చాలు.. శివ అనుగ్రహం కలగాల్సిందే!

Karthika Masam 2025

Karthika Masam 2025

Karthika Masam 2025: హిందూ సంప్రదాయంలో అంత్యత పవిత్ర మాసాలాలో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ మాసంలో శివ కేశవులు ఇద్దరినీ పూజిస్తారు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా సోమవారం రోజు శివయ్యను పూజించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం విశిష్టమైనదే అయినా చివరి కార్తీక సోమవారానికి మరింత ప్రత్యేకత, ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. ఈ ఒక్క సోమవారం వ్రతం ఆచరించడం వల్ల కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతున్నారు శివయ్య అనుగ్రహాన్ని పొంది, సకల శుభాలు, ఐశ్వర్యం సిద్ధించడానికి చివరి సోమవారం నాడు ఆచరించవలసిన పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. కాబట్టి నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంటి వద్దనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పవిత్ర నదీ జలాన్ని కలుపుకోవచ్చట. రోజు మొత్తం ఉపవాసం ఉండడం ఉత్తమం. ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు, అల్పాహారం తీసుకోవచ్చట. ఉదయం నుంచి సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని నక్తం అని అంటారు. కాగా ఆరోజున ఇంటిలో పూజా మందిరాన్ని శుభ్రం చేసి తులసికోట దగ్గర, శివుని పటాల ముందు దీపారాధన చేయాలట. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలని చెబుతున్నారు. కార్తీక సోమవారం రోజు శివలింగాన్ని పూజించడం ప్రధానమైనదిగా చెబుతున్నారు.

‎శివలింగానికి పాలాభిషేకం, లేదా పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధపు నీరు వంటి పంచామృతాలతో అభిషేకం చేయాలట. తర్వాత శివుడికి మారేడు దళాలు, తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో పూజ చేయాలట. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలని చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు. సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం అని చెప్పాలి. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి, వీలైతే శివాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని అక్కడ కూడా దీపాలను వెలిగించాలట.

‎ చివరి కార్తీక సోమవారం నాడు 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం లేదా 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని చెబుతున్నారు. శివయ్యను భక్తితో ప్రార్థించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి, సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి లభిస్తుందని చెబుతున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున నిష్టగా ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించిన వారికి మోక్షం లభిస్తుందని,జన్మరాహిత్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి, ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయట.

Exit mobile version