Site icon HashtagU Telugu

Solar Eclipse: ఈ ఏడాది దీపావళి, సూర్యగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి..!! లక్ష్మీ పూజ చేయాలా?వద్దా?

Solar Eclipse 2024

solar eclipse

ఈఏడాది వచ్చే దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్య గ్రహం. భారతదేశంలో కూడా సూర్యగ్రహణం కనిపిస్తుంది. దీపావళి, సూర్యగ్రహణం రెండూ ఒకే రోజు రావడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో దీపావళి జరుపుకోవడమా లేదా…అనే సందేహాలు నెలకొన్నాయి. ఐశ్వర్యం,శ్రేయస్సుకు చిహ్నాలు అయిన లక్ష్మీదేవిని పూజిస్తారా లేదా అనే సందేహాం ముఖ్యంగా ప్రజల్లో నెలకొంది. ఈ సందేహాలను నివ్రుత్తి చేసుకుందాం.

ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వస్తుంది..?
దీపావళి కార్తీకమాసంలో కృష్ణ పక్షం అమావాస్య రోజున వస్తుంది. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి అక్టోబర్ 24 సాయంత్రం 4.44 గంటలకు ముగుస్తుంది. దీని తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది. దీపావళి, నరకచతుర్దశి రెండూ కూడా అక్టోబర్ 24,2022న జరుపుకుంటారు. అక్టోబర్ 25, 2022 మంగళవారం కార్తీక కృష్ణ పక్షం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీపావళి రోజున ఏ గ్రహణం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. ఇది సిద్ధుల గొప్ప పండగ. అందుకే బుుషులు దీనిని సిద్ధికల్ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే గ్రహణాల వల్ల గ్రంథాల ప్రకారం ఎలాంటిప్రభావం చూపదు.

ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదు..?
భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఉదయం 4:31 గంటలకు మధ్యలో 5:14 గంటలకు మధ్యలో ఏర్పడుతుంది. గ్రహణం స్వాతి నక్షత్రం, తులరాశిలో ఉన్నందున ఈ రాశులలో జన్మించిన వారు వ్యాధి, నొప్పి, బాధలు అనుభవిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు గ్రహణాన్నినివారించాల్సి ఉంటుంది. ఇక భారత్ తోపాటుగా స్వీడన్, నార్వే, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ తోపాటు మరికొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.