Site icon HashtagU Telugu

Lakshmi Devi: శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ఇలా పూజ చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు?

Lakshmi Devi

Lakshmi Devi

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఈ విధంగానే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఉండడంతో పాటు ఆయన ఆరోగ్యాలతో జీవించి డబ్బుకు కొదువ ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించింది అంటే చాలు అనుకున్న పనులు అన్ని విజయవంతంగా పూర్తి అవ్వడమే కాకుండా ఇంట్లో డబ్బే డబ్బు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి గట్టెక్కుతారు.

పరిముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మి దేవిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మి దేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు శ్రీ సూక్తం చదవాలి. పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వును సమర్పించాలి. ప్రతి ఒక్క శుక్రవారం రోజు గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. అదేవిధంగా శుక్రవారం రోజు ముగ్గురు పెళ్ళికాని అమ్మాయిలను ఇంటికి పిలిచి వారికి పాయసం ఇచ్చి వారికి ఆకు ఒక్క వాయనం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

మీరు కార్తిక ఇబ్బందులతో సతమతమవుతుంటే శుక్రవారం రోజు నల్ల చీమలకు పంచదార ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకుంటున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఈ విధంగా 11 శుక్రవారాలు చేయాలి. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం శుక్రవారం ఏదైనా నైవేద్యాన్ని సమర్పించాలి. మరి ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మి దేవికి పాలు లేదా పాలతో తయారు చేసిన తెల్లని స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారి దీవెనలు తప్పకుండా కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు శుక్రవారం రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తీపి పెరుగు తినడం వల్ల పనిలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. శుక్రవారం రాత్రి పూట అష్టలక్ష్మి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. రాత్రిపూట అష్టలక్ష్మిల ముందు అగరబత్తి వెలిగించి ఎర్ర గులాబీలను సమర్పించాలి.

Exit mobile version