Site icon HashtagU Telugu

Spiritual: అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే.. ఈ దీపం వెలిగించాల్సిందే!

Spiritual

Spiritual

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పదిమందిలో ఆరుగురు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు అవుతూ ఉంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక చాలామంది తలలు పట్టుకుంటూ ఉంటారు. అయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందడం కోసం కందుల దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు పండితులు. మరి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏంటి అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఇందుకోసం ముందుగా ఇంట్లోనే పూజ మందిరంలో సుబ్రహ్మణ్యస్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి ఎదురుగా ఒక పీట వేసి ఆ పీట మీద బియ్యప్పిండితో షట్కోణం ముగ్గు వెయ్యాలి. ఆ తరువాత ఆ పీట మీద రాగి లేదా వెండి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి. ఆ పల్లెకి ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించాలి. ఆ తర్వాత పీట మీద ఉంచిన పళ్లెంలో ఒక కేజీ ఎర్ర కందిపప్పు లేదా మసూర్ పప్పును ఉంచాలి. కేజీ వీలు కాకపోతే ఒక గుప్పెడు ఎర్ర కందిపప్పును అయినా ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి.

ఆ పప్పు మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దానిమీద మరొక ప్రమిదను ఉంచాలి. ఆ తర్వాత ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఎర్ర వత్తులు తీసుకొని వాటిని కలిపి ఒక వత్తిలా చేసి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ దీపం దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. అయితే మా దగ్గర ఎర్ర వత్తులు లేవు అనుకున్న వారు మామూలు వత్తులను తీసుకుని వాడికి కొంచెం కుంకుమ రాసి తొమ్మిది ఒత్తులుగా చేసి దీపాన్ని వెలిగించవచ్చు అని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు కలిగి మీరు తొందరగా రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు.