హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. ఈ పండుగ రోజున ఇంటిని మొత్తం దీపాలతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. విద్యుత్ లైట్ల కంటే ఈరోజున దీపాల వెలుతురుతోనే ఇల్లు అందంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీపావళి పండుగను ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే చాలామంది ఈ పండుగ రోజున తెలిసి తెలియక కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. మరి దీపావళి రోజు ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? అన్న విషయానికి వస్తే..
ఈరోజున అరవడం, పొట్లాడటం లాంటివి అస్సలు చేయకూడదట. ప్రేమ,కరుణ వంటివి లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేట్లా చేస్తాయి. పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు. చిందరవందరగా, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసించదట. అలాగే అపార్థాలు,గొడవలు ఉన్నచోటిని ఆమె అసహ్యించుకుంటుందట. మీ ఇంట్లో శాంతి, సామరస్యం ఉండేలా చేసుకోవాలట.
ఇంట్లో స్త్రీలను అగౌరవంగా చూడవద్దని చెబుతున్నారు. మీ ఇంట్లో ఆడవారు ఆనందంగా ఉంటే, లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుందట. సూర్యోదయంకి ముందే నిద్రలేచి సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవాలని చెబుతున్నారు. వంట చేసేటప్పుడు మీరు రుచి చూడకూడదట. స్నానం చేసి, అగ్నిదేవుడు, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాకనే మీరు తినాలని చెబుతుతున్నారు. పవిత్ర దినాలను గౌరవించాలట. దీపావళి వంటి పండగలు, శుక్రవారాలు లక్ష్మీదేవికి చాలా ముఖ్యం అని ఆ రోజుల్లో పూజచేయటం మరకూడదట. పూజ దీపావళి హారతి కుటుంబసభ్యులు అందరి సమక్షంలో జరగాలి. దాని ద్వారా అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చట. లక్ష్మీదేవికి సందోహంగా ఉన్న ప్రదేశాలు నచ్చవట. వాతావరణం శాంతిగా, సామరస్యంగా ఉండాలి. ఇతర దేవతలకి హారతి ముగించాక, భక్తులు ఆనందంలో చప్పట్లు కొడతారు. కానీ లక్ష్మీపూజ హారతి తర్వాత చప్పట్లు కానీ, శబ్దాలు కానీ చేయవద్దు. ఒక చిన్న గంట శబ్దం చేస్తే చాలు. హారతి అయిన వెంటనే బాణసంచా కాల్చవద్దు అని చెప్తున్నారు.