ఇతరులకు దానం చేసే గుణం ఉండడం చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎక్కువ హంగులు ఆర్భాటాలకు పోకుండా మనకు ఉన్నంతలోనే ఇతరులకు అలాగే లేని వారికి సహాయం చేయడం అన్నది చాలా మంచి గుణం అని చెబుతూ ఉంటారు. ఇకపోతే మనం ఇంటి దగ్గరకు వచ్చే బిక్షగాళ్లకు అలాగే కొంతమంది పేదవారికి వస్తువులు ధనము, బట్టలు వంటివి ఇస్తూ ఉంటారు. కొంతమంది వారు ఉపయోగించిన దుస్తులు వారికి సరిపోవడం లేదని, బట్టలు టైట్ గా అవుతున్నాయి పట్టడం లేదు అని ఇలా వివిధ కారణాల వల్ల ఆ బట్టలను లేని వారికి ఇస్తూ ఉంటారు.
మరి ఈ విధంగా బట్టలను వేరే వారికి దానం చేస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇతరులకు దుస్తులను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందట. మనం వాడిన దుస్తులు దానం చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలట. చిరిగిన లేదంటే రంగు మాసిన నాసిరకం దుస్తులను దానం చేస్తే పుణ్యం లభించకపోగా పాపం తగులుతుందని చెబుతున్నారు. కాబట్టి అలా చిరిగిపోయిన బట్టలను దానం చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. మీకు దుస్తులను దానం చేయాలి అనిపిస్తే మంచి దుస్తులను దానం చేయడం మంచిదట. లేదంటే కొత్తవి కొనుగోలు చేసి వాటిని దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
మీరు వాడిన దుస్తులు చినిగిపోకుండా బాగా ఉన్న దుస్తులు అది కూడా మురికిగా ఉన్నప్పుడు కాకుండా వాటిని ఉతికి ఇతరులకు దానం చేయడం మంచిదని చెబుతున్నారు. మనం దుస్తులు ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి ఎంత తృప్తి చెందితే అంత పుణ్యం లభిస్తుందట. సోమవారం రోజు తెలుపు రంగు దుస్తులను మంగళవారం ఎరుపు రంగు దుస్తులను బుధవారం ఆకుపచ్చ లేదా నీలిరంగు, శనివారం రోజు నలుపు రంగు దుస్తులను దానం చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.