Site icon HashtagU Telugu

Friday: ఉప్పు నీటితో స్నానం, పచ్చ కర్పూర హారతి.. శుక్రవారం ఇలా చేస్తే దశ తిరగడం ఖాయం!

Friday

Friday

లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం చేయబడింది. ఈ రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆమె అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే శుక్రవారం రోజు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసేవారు ప్రత్యేక పద్ధతులు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు. అయితే లక్ష్మి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు ఎలాంటి పద్ధతులను అనుసరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దృష్టి దోషాలు ఉన్నాయి అనుకున్న వారు అవి తొలగిపోవడం కోసం ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేయాలట. ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఉప్పు వేసి తుడవడం వల్ల నరఘోష, దుష్టి దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకమైన అభీష్ట సిద్ధి కోసం పూజించే వారు ఉపవాసం ఉండడం మంచిదట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చని చెబుతున్నాను. శుక్రవారం ఉపవసించి లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయట. సిరి సంపదలు, ఆకస్మిక ధన లాభాలు కావాలి అని కోరుకునేవారు శుక్రవారం 108 తామర పూలతో శ్రీలక్ష్మీ దేవిని అష్టోత్తర శతనామాలతో పూజిస్తే ఆ ఇంట సిరిసంపదలు తాండవిస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బియ్యం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట.

అలాగే అమ్మవారి సంతోషిస్తుందని చెబుతున్నారు. ఎవరైనా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో ఉంటే వారు శుక్రవారం బ్రాహ్మ ముహూర్తంలో తమ ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడవచ్చట. జీవితంలో వీరికి ఎన్నడూ డబ్బుకు లోటుండదని చెబుతున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని చెబుతున్నారు. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన ఇంట్లో సుఖ శాంతులు, ఐశ్వర్యం కలుగుతుందట. శుక్రవారం దీపాలు పెట్టే వేళ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం వలన ఆ ఇల్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో కళకళలాడుతుంటుందట.