Site icon HashtagU Telugu

Spatika: మీ కష్టాలు మాయం అవ్వాలంటే స్పటికతో ఈ విధంగా చేయాల్సిందే!

Spatika

Spatika

మామూలుగా మనకు స్పటిక పూజ స్టోర్ లలో అలాగే మార్వాడి షాపులలో లభిస్తూ ఉంటుంది. ఈ స్పటిక చూడడానికి తెల్ల రాయి మాదిరి ఉంటుంది. చూడడానికి ఇది అచ్చం మనం తినే కలకండ లాగే ఉంటుంది. అయితే ఈ స్పటికను చాలామంది మార్వాడి షాప్ వాళ్ళు షాపు బయట కౌంటర్ వద్ద ఒక తెల్లటి ప్లేటులో కుంకుమ పెట్టి పెడుతూ ఉంటారు. బంగారు దుకాణాల్లో కూడా ఈ స్పటికను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే ఇతర వ్యాపార ప్రదేశాలలో నరదృష్టిని తొలగించుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నరదృష్టి తొలగిపోయి ధనాకర్షణ పెరగడానికి స్పటిక ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ స్పటికను ఉపయోగించే అనేక రకాల సమస్యలను కష్టాల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

ఎప్పుడూ కూడా అమావాస్య రోజు ఈ స్పటికను కొనుగోలు చేయకూడదు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తరువాత అనగా ఆరు దాటిన తర్వాత స్పటికను కొనుగోలు చేయకూడదు. ఒకవేళ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే ఆది సోమవారాలలో మాత్రమే ఇంటికి తెచ్చుకోవడం మంచిది. అమావాస్య రోజు పౌర్ణమి ఘడియల్లో లేదా శనివారం ఆదివారం సోమవారం రోజుల్లో స్పటికను ఇంటి గుమ్మం పైన కట్టడం వల్ల నరదిష్టిని తొలగించుకోవచ్చట. దారం లేదంటే వెంట్రుకలతో తయారు చేసిన తాడుతో కలిపి గుమ్మానికి ముందు వేలాడదీయాలని చెబుతున్నారు. లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను మూటగట్టి గుమ్మం పై వేలాది వేలాడదీయాలట. ఇలా కట్టిన స్పటికను నెలకు ఒక్కసారి లేదంటే మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవడం మంచిదని చెబుతున్నారు.

అలా వాడిన స్పటికను నీటిలో వదిలేయడం మంచిది. పొరపాటున కూడా ఆ స్పటికను ఇంటి లోపలికి తీసుకెళ్లకూడదు. మన ఇంటి ముందు గుమ్మం బయట కట్టడం వల్ల మనం ఆ స్పటిక కింద వెళుతూ వస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతికూల శక్తులను నరదృష్టిని లాగేసుకుంటుందని చెబుతున్నారు. తాంత్రిక ప్రయోగాలను తొలగించుకోవడం కోసం ఒక నల్లటి వస్త్రంలో స్పటికతో పాటుగా 6 లవంగాలు ఒక రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లతాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి మూట కట్టి ఆఫీస్ బయట లేదా ఇంటి గుమ్మం బయట కట్టినట్లయితే అన్ని తొలగిపోయి జనాకర్షణ పెరుగుతుందట. నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న స్పటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయని చెబుతున్నారు.

పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు క్రింద ఒక స్పటిక ముక్క పెట్టి పడుకోవాలి. వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్పటిక ముఖ ఒక గాజు ప్లేటుపై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. ఒక స్పటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుందట. ఆ తర్వాత స్పటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతిపెట్టాలి. వ్యాపారం నష్ట పోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవడానికి స్పటిక పౌడర్ ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిలో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందట. లక్ష్మీదేవికి ప్రీతిక కనుక స్పటికను ఇంట్లో ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది.