Site icon HashtagU Telugu

Naivedyam: దేవుడికి నైవేద్యం సమర్పించే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

Naivedyam

Naivedyam

మామూలుగా మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం. గుడిలో దేవుడికైనా ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న దేవుడి కైనా మనం నైవేద్యాన్ని తప్పకుండా సమర్పిస్తూ ఉంటాం. ఇక దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం మంచిదే కానీ తెలిసి తెలియకుండా నైవేద్యాలు సమర్పించే సమయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది. చాలా ముందుగా తయారు చేసినవి బాగా చల్లారి పోతాయి కనుక వాటిని నైవేద్యంగా పెట్టరాదని శాస్త్రం చెబుతోంది.

అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది. నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారు చేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధంచేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదట. అలాగే నిలవ ఉన్నవీ, పులిసిపోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని యజమానులు మాత్రమే మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి.

ఇతరులు పనికిరారట. అలాగే అతి పులుపు,అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించకూడదట. ఇకపోతే నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాలి. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఒక వేళ అల అవ్వని స్థితిలో స్వామివారిని నేను చేసిన ప్రసాదం నా తరపున ఫలానా వ్యక్తి పెడుతున్నారు. నైవేద్య అపరాదం ఉంటే క్షమించని అడగాలి. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలని చెబుతున్నారు. నైవేద్యం పెట్టే సమయంలో ఆహారా పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి.

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ‘ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి/ అమ్రుతమస్తు /అమ్రుతోపస్తరణమసి స్వాహా/ అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్లి చిలకరించాలి. తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా , అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి దేవతలకు చూపించాలి. మధ్యే మద్యదే పానీయం సమర్పయామి, అని నైవేద్యే పానీయం సమర్పయామి అని నైవదే్యం మీద మళ్ళ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాస్టాంగం చేసి లేవాలి. నైవేద్యం కోసం ఏ పదార్థాలను వేడిగా తయారుచేసినా అవి గోరువెచ్చగా వున్నప్పుడు మాత్రమే దైవానికి సమర్పించాలని స్పష్టం చేస్తోంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. ఈ నియమాలను పాటించకుండా నైవేద్యాలను సమర్పించడం వలన ఉత్తమగతులు పొందే అవకాశాలు కోల్పోవడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.