Site icon HashtagU Telugu

Astrology: దీపారాధనలో ఎన్ని వత్తులు ఉండాలి…వాటి ఫలితాలు ఎలా ఉంటాయి..!!

Deepam

Deepam

సాధారణంగా ప్రతిఇంట్లో పూజామందిరంలో దీపం వెలిగించిన తర్వాతే పూజ మొదలుపెడుతుంటారు. దీపం లక్ష్మీ స్వరూపమనీ…దీపాన్ని వెలిగిస్తే…సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే పూజాగదిలో ఏ ప్రమిదల్లో దీపారాధన చేయాలి. అందులో ఎన్ని వత్తులు వేయాలి. ఏ నూనెను ఉపయోగించాలి. ..ఇలాంటి విషయంనే భక్తులు ఆలోచనల్లో పడుతుంటారు.

దీపారధనకు వెండి కుందులు ఉపయోగించడం చాలా మంచిది. ఏ ప్రమిదలో దీపారాధన చేసినా…ఆ ప్రమిద కింద ఒక చిన్న పళ్లాన్ని ఉంచాలి. దేవుడికి ఒక వైపున ప్రమిదలో ఆవునెయ్యిని …మరో ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపారధన చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. ప్రమిదలో ఒక నిలువు వత్తి…ఒక అడ్డవత్తిని వేసి దీపారాధన చేయాలి. మూడు వత్తులతో దీపారాధన చేయడం వల్ల సంతాన లాభం కలుగుతుంది. 5 వత్తులతో దీపారాధన చేస్తే సంపదలు చేకూరుతాయి. 9 వత్తులతో దీపారధన చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గంధ్రాలు, పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల…దీప దానం వల్ల ఎన్నో విశేష ఫలితాలు కలుగుతాయి.

Exit mobile version