Lord Balaji: తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిత్యం కొన్ని లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సంవత్సరంలో 365 రోజులు కూడా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 06:30 AM IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిత్యం కొన్ని లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సంవత్సరంలో 365 రోజులు కూడా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి రోజు శ్రీవారి దర్శనం కోసం వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి రోజులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి స్వామివారి మూలవిరాట్ను క్షణకాలం చూసిన తర్వాత వాళ్లు పడ్డ కష్టం అని మరిచిపోయి జన్మం ధన్యమైనట్లుగా భావిస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఆ తిరుమల శ్రీవారి కోసం ఏడుకొండలు ఎక్కి మరీ మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తరచుగా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. బంగారంతో మెరిసిపోయే ఆనంద నిలయంలో కొలువైన స్వామి వారు అలంకార ప్రియుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అయితే వెంకటేశ్వర స్వామి కేవలం అలంకార ప్రియుడు మాత్రమే కాదు ఆహార ప్రియుడు కూడా.

అయితే అటువంటి తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తిరుమలలో లభించే లడ్డుకు ఉన్న ప్రాధాన్యత గురించి మనందరికీ తెలిసిందే. తిరుమలలో లభించే లడ్డు మరే ఇతర ప్రదేశాలలో కూడా లభించదు అని భక్తులు చెబుతూ ఉంటారు. తిరుమల శ్రీవారికి ప్రతిరోజు అనేక రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. ఎంతో రుచికరమైన లడ్డుతోపాటుగా వడ, అప్పాలతో పాటుగా దోస, జిలేబి, మురుకు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ప్రతిరోజు నైవేద్యాలలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ గురువారం శుక్రవారం లో నైవేద్యాల్లో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయట.