Site icon HashtagU Telugu

Diwali: దీపావళి పండుగ రోజు ఎన్ని దీపాలను వెలిగించాలో తెలుసా?

Diwali

Diwali

దసరా ఉత్సవాలు ముగిశాయి. ఇక త్వరలోనే దీపావళి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 31వ తేదీన ఈ దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఈ దీపావళి పండగ రోజున ఇంటిని దీపాలతో అలంకరించి, లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుందని నమ్ముతారు. ఇంట్లో పేదరికం ఉన్నా తొలగిపోతుందని కూడా నమ్ముతారు. అంతేకాదు ఇల్లు ఆనందం విరి విల్లుతుందని, ఇల్లు అభివృద్ధి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. రాముడు రావణాసురుని చంపిన తర్వాత సీతాదేవితో కలిసి అయోధ్య తిరిగి వచ్చాడు.

ఈ సందర్భంగా ఆ రోజున పురస్కరించుకొని ఈ దీపావళి పండుగ సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి పండుగ రోజు కొందరు లక్ష్మీదేవిని పూజిస్తే మరికొందరు శ్రీరాముడిని పూజిస్తూ ఉంటారు. దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించే ప్రతి ఒక్కరికి కలిగే సందేహం ఏమిటంటే ఇంట్లో ఎన్ని దీపాంతులు వెలిగించాలి అన్న సందేహం. మరి ఈ పండుగ రోజు ఎన్ని దీపాలను వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి లేదంటే విఘ్నేశ్వరుడి ముందు ఒక దీపం వెలిగించాలట. అలాగే మీకు ఇష్టమైన దేవుడు ముందు కూడా ఒక దీపం వెలిగించాలట. ఆ తర్వాత వంట గదిలో ఒక దీపం బాత్రూం దగ్గరిలో ఒక దీపం ఇంటి ప్రధానముక ద్వారం వద్ద ఒక దీపం తులసి మొక్క వద్ద ఒక ద్వీపం ఇంటి పైకప్పు లో ఒక దీపం వెలిగించాలని చెబుతున్నారు.

అయితే గత సంవత్సరం ఉపయోగించిన దీపాలను ఉపయోగించేవారు ఆ దీపాలను తప్పనిసరిగా శుభ్రం చేయాలని చెబుతున్నారు. అలా ఈ దీపావళి పండుగ రోజున ఏడు దీపాలను కచ్చితంగా వెలిగించాలని చెబుతున్నారు. దీపావళి రోజున దీపాలను ఏ దిశలో వెలిగించాలి? దీపావళి అమావాస్య నాడు వస్తుంది కాబట్టి, ఈ రోజున, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నాలుగు దిక్కులలో దీపాలను వెలిగించాలి. దీపావళి రోజున తూర్పు దిక్కున దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే దీపావళి రోజున ఉత్తర దిశలో దీపాలను వెలిగించడం వల్ల కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి.

అయితే, పశ్చిమ దిశ మహాలక్ష్మికి చెందినది. దీపావళి రోజున ఈ దిశలో దీపాలను వెలిగించడం సంపదను తెస్తుందట. అలాగే సంపద కూడా పెరుగుతుందని, ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. దీపావళి రోజున, దక్షిణ దిశలో దీపాలను వెలిగించాలి ఎందుకంటే ఇది యమ దిక్కు, అమావాస్య తేదీ యమరాజుచే ప్రభావితమవుతుందట. అటువంటి పరిస్థితిలో, దీపావళి రోజున దక్షిణ దిశలో దీపం వెలిగించడం వలన అకాల మరణం సంభవించే అవకాశం ఉండదని పండితులు చెబుతున్నారు.