మాములుగా గడపలేని ఇల్లు దాదాపుగా ఉండవు. ముఖ్యంగా భారతదేశంలో నివసించే ప్రజల ఇంటికి తప్పనిసరిగా గడప ఉంటుంది. వారెన్ సైడ్ వెళ్లే కొద్దీ ఇంటికి గడప అనేవి ఉండవు. అయితే ఇంట్లో మెయిన్ డోర్ వద్ద గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. గడపకు పూజలు చేసి బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తూ ఉంటారు. అందుకే గడప విషయంలో కొన్ని పొరపాట్లు కూడా చేయకూడదని చెబుతూ ఉంటారు. గడప ఎంత అందంగా చక్కగా ఉంటే లక్ష్మీదేవి ఇష్టపడి ప్రవేశిస్తుందని నమ్ముతారు. మన పూర్వీకులు భూమికి, ఆకాశానికి మధ్య హద్దుగా ఈ గడపను పెట్టారని శాస్త్రాలు చెబుతుంటాయి.
రాక్షస రాజైనా హిరణ్యకశిపుని సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహస్వామి గడప పై కూర్చుని అంతమొందించాడు. అందుకే గడపను సాక్షాత్తు లక్ష్మీదేవి భావిస్తుంటారు. అందుకోసమే గడపపై తొక్క కూడదని, గడప పై తుమ్మ కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే గడపపై అటు ఇటుగా గాలు వేసి నిల్చకూడదని, ఉంటే గడప అవతలి వైపు లేదా ఇవతలి వైపు మాత్రమే ఉండాలని చెబుతూ ఉంటారు. లక్ష్మి స్వరూపంగా భావించే మన ఇంటి గడపకు పసుపు రాసి బొట్లు పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం. ఈ విధంగా భక్తితో గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం ఒక ఆచారంగా భావిస్తున్నారు. అంతేకాకుండా గడపకు బొట్లు పెట్టడం వల్ల మనకు ప్రాణ రక్షణ కూడా ఉంటుందట.
సాధారణంగా పల్లెటూర్లలో ఇళ్లను తోటలలో నిర్మించుకుంటారు. అలాంటప్పుడు పొలాలలో నుంచి వచ్చే ఏవైనా విష పురుగులు ఇంటి లోనికి ప్రవేశించకుండా ఈ పసుపులో ఉన్న ఔషధ గుణాలు క్రిమి కీటకాలను లోపలికి రానీయకుండా కాపాడుతుందట. అంతేకాకుండా గడపకు వేసే చెక్క తొందరగా చెదలు పట్టి పాడవుతుంది. పసుపును రాయడం వల్ల అందులో ఉన్న యాంటీ బయోటిక్స్ వల్ల చెద పురుగులు నివారణ జరిగే గడప ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందట.
అందుకోసమే మన పూర్వీకులు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేవారు. ప్రస్తుతం అదే ఆచారంగా నేటి తరం వరకూ కొనసాగుతూనే వస్తోంది. ఇంతకీ గడపకు ఎన్ని బొట్లు పెట్టాలి అన్న విషయానికి వస్తే.. మామూలుగా గడపకు ఒకటి లేదా మూడు బొట్లు పెట్టడం మనం చూసే ఉంటాం. కొన్ని కొన్ని ప్రాంతాలలో ఐదు బొట్లు కూడా పెడతారు. శుభకార్యాల సమయంలో కూడా బొట్లు పెడుతూ ఉంటారు. వీటి వల్ల నరదృష్టి తగలదని చెబుతూ ఉంటారు.