Vasthu Tips: వాస్తు ప్రకారంగా ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలో తెలుసా?

వాస్తు శాస్త్రంలో ఇంటి ద్వారాలకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాస్తుశాస్త్రంలో ఇంటికి ద్వారాలు ఎన్ని ఉండాలి అన్న వ

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 09:30 PM IST

వాస్తు శాస్త్రంలో ఇంటి ద్వారాలకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాస్తుశాస్త్రంలో ఇంటికి ద్వారాలు ఎన్ని ఉండాలి అన్న విషయాన్ని కూడా చెప్పబడ్డాయి. కానీ చాలామంది ఈ విషయాన్ని తేలికగా కొట్టి పారేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు మాత్రం ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అద్దె ఇల్లు అయినా, సొంత ఇల్లు అయినా శుభ సంఖ్యలో ద్వారాలు ఉండాలని శాస్త్రీయ పరంగా ద్వారాలకు ఒక విశిష్ట స్థానం ఉందని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

శుభ సంఖ్యలో ద్వారాలు ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. అదే శాస్త్రానికి విరుద్ధంగా ద్వారాలు ఉంటే అశాంతి కలిగించే ఫలితాలు ఇస్తాయి. మనం నివసించే ఇంటిలో రెండు ద్వారాలు ఉంటే చాలా శ్రేష్టము. రెండు ద్వారాలు గల ఇంటిలో నివసించే వ్యక్తులు శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది. అదే నాలుగు ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు ఆయువు, ఆరోగ్యాలను కలిగి వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఏర్పడి మంచి గుర్తింపు కలుగుతుంది. ఆరు ద్వారాలు ఉన్న ఇల్లు పుత్ర వృద్ధి, శ్రేయస్సు, ఐశ్వర్యమ కలుగుతుంది.

ఎనిమిది ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు సకల భోగభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. పన్నెండు ద్వారాలు గల ఇల్లు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని కలిగించి మంచి కీర్తి ప్రాప్తిస్తుంది. పద్నాలుగు ద్వారలు ఉన్న ఇల్లు కుటుంబ వృద్ధి, ధన సంపదని కలిగిస్తుంది. పదహారు ద్వారములు గల ఇల్లు అన్నింటిలో విజయం లభించింది లాభములను చేకూరుస్తుంది. ఇక మూడు ద్వారములు గల ఇల్లు శత్రువులను పెంచి అపనిందల పాలుచేస్తుంది. అధిక ఖర్చులను పెంచి ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుంది. ఐదు ద్వారాలు గల ఇల్లు అనారోగ్య సమస్యలను, సంతానానికి కీడును, శత్రువుల నుండి ఇబ్బందులను కలిగిస్తుంది. ఏడు ద్వారములు ఉన్న ఇల్లు మరణాలకు దారితీస్తుంది. అధిక కష్టాలను కలిగించి ఇబ్బందులకు గురిచేస్తుంది.