Bangles: ఆడవారు చేతులకు ఎన్ని గాజులు వేసుకోవాలి.. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసా?

పెళ్లి అయిన తర్వాత పిల్లి కాక ముందు స్త్రీలకు కొన్ని రకాల ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్త్రీలు పెళ్లి కాకముం

  • Written By:
  • Updated On - February 29, 2024 / 08:14 PM IST

పెళ్లి అయిన తర్వాత పిల్లి కాక ముందు స్త్రీలకు కొన్ని రకాల ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్త్రీలు పెళ్లి కాకముందు కొన్ని రకాల ఆభరణాలు ధరించిన ధరించకపోయినా పెళ్లి తర్వాత మాత్రం తప్పకుండా కొన్ని రకాల అభరణాలను ధరించాల్సిందే.. అలా పెళ్లయిన ఆడవారు ధరించాల్సిన వాటిలో గాజులు కూడా ఒకటి. అయితే పెళ్లి అయిన ఆడవారు ఎప్పుడు కూడా చేతుల నిండా చాలా గాజులు వేసుకుని ఉండాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కానీ సిటీలలో ఉండే వారు మాత్రం ఒక చేతికి గాజులు వేసుకునే మరొక చేతికి బ్యాంగిల్స్ లేకుండా వాచ్ లాంటివి ధరిస్తూ ఉంటారు. ఏమైనా అంటే స్టైల్ అని చెబుతూ ఉంటారు.

పెళ్లయిన ఆడవారు కూడా ఇదే కల్చర్ ని ఫాలో అవుతుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. మరి శాస్త్ర ప్రకారం పెళ్లి అయినా ఆడవారు చేతులకి ఎన్ని గాజులు ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లితో ఆడవారి జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా కట్టు, బొట్టులో. పెళ్లి తర్వాత నుదిటిన ఖచ్చితంగా బొట్టుపెట్టుకోవాలని, మెడలో తాళి బొట్టు, చేతులకు గాజలు వేసుకోవాలని, కాలి వేళ్లకు మెట్టెలు పెట్టుకోవాలనే నియమాలు ఉన్నాయి. ఇవన్నీ ఆమె ముత్తైదువని చూపిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు గాజలును వీలైనంత తక్కువగా వేసుకుంటున్నారు. ఒక్కో చేతికి ఒకటి, రెండు లేదా మూడు వేసుకుంటున్నారు.

కొంతమంది ఆడవారైతే ఒక చేతికి వాచ్ పెట్టుకుని ఇంకో చేతికి ఒకటిరెండు గాజులను వేసుకుంటున్నారు. కానీ హిందూ మతంలో పెళ్లైన ఆడవారు ఒక్కోచేతికి కొన్ని గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి. గాజులను బుధుడు, చంద్రుడి చిహ్నాలుగా భావిస్తారు. వీటిని వేసుకోవడం పెళ్లైన ఆడవారికి ఎంతో శుభదాయకమని చెబుతున్నారు. చేతులకు గాజులను కేవలం అందం కోసమే వేసుకుంటారని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే? చేతులకు గాజులను వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆడవాళ్ల మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎవరికి నచ్చినన్ని వారు గాజులను వేసుకుంటుంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం పెళ్లైన ప్రతి మహిళ ఒక్క చేతిలో కనీసం 21 గాజులను వేసుకోవాలి. అలాగే రెండు చేతులకు సమానంగా గాజులు ఉండాలి. గాజులతో పాటుగా మీరు మీ చేతులకు బ్రాస్లెట్లను కూడా ధరించొచ్చు. ఇందుకోసం బంగారం లేదా వెండితో చేసిన 2 బ్రేస్ లెట్లను కలిపి వేసుకోవచ్చు. కొత్తగా పెళ్లైన ఆడవారు ఖచ్చితంగా గాజులను నిండుగా వేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు.

నవ వధువులు ఒక సంవత్సరం పాటు చేతులకు గాజు గాజులను వేసుకోవాలనే సాంప్రదాయం ఉంది. ఏడాది కాకుండా కనీసం 40 రోజుల పాటైనా గాజులను కచ్చితంగా వేసుకోవాలి. మీరు మీ పాత గాజులను తీసేసి కొత్తవాటిని వేసుకోవాలనుకుంటే కొత్త గాజులను ఉదయం లేదా సాయంత్రం పూట మాత్రమే మార్చుకోండి. మధ్యాహ్నం పూట పాత గాజులను తీసేసి కొత్త గాజులను వేసుకోకూడదు. పెళ్లైన ఆడవారు ఎప్పుడూ కూడా ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులనే వేసుకోవాలి. వీళ్లు పొరపాటున కూడా నలుపు, ముదురు రంగుల గాజులను వేసుకోకూడదు.