Evil Eye: నరుల దృష్టికి నల్ల రాయి అయినా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం. అంటే చెడు ద్రుష్టికీ అంతటి పవర్ ఉంటుంది అని అర్ధం. అయితే చెడు దృష్టి తగిలింది అంటే రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి పని తలపెట్టినా కూడా అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. అయితే దృష్టి నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు.
అందులో భాగంగానే బూడిద గుమ్మడికాయ, మిరపకాయలు నిమ్మకాయలు వంటివి కట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. ఒక్క ఇంటి ముందు మాత్రమే కాకుండా వ్యాపార స్థలాలలో కూడా ఈ విధంగానే చేస్తుంటారు. నిమ్మకాయ మిరపకాయ చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి. కానీ ఎవరికైతే చెడు దృష్టి తగులుతుందో అప్పుడు నిమ్మకాయ మిరపకాయతో కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ 5 రకాల వస్తువులతో చెప్పినట్టు చేస్తే చెడు దృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు.
ఎవరైతే తమపై చెడు దృష్టి ఉందని భావిస్తున్నారో వారు ప్రతి సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం మంచిదట.
ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని, ఇల్లు లేదా వ్యక్తిపై చెడు దృష్టి ఉంటే అది నెమ్మదిగా తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే చేపట్టిన పనిలో పదే పదే అడ్డంకులు ఎదురైనప్పుడు మీరు మీ ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకూడదట. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వాలని చెబుతున్నారు. అలాగే తరచుగా వేప ఆకులతో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుందట. వేపకు కుజుడు, శని,కేతు గ్రహాలతో సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో, వేప ఆకులను ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి ఉపశమనం లభిస్తుందట. మంగళవారం రోజు కర్పూరంతో పాటు లవంగాలను వెలిగించడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. కాగా శనివారం సాయంత్రం సమయంలో శని చాలీసా పారాయణం చేయడం వల్ల చెడు దృష్టి తొలగిపోతుందట. కాబట్టి చెడు దృష్టి సమస్యతో బాధపడుతున్న వారు పైన చెప్పిన విధంగా చేస్తే తప్పకుండా చెడు దృష్టి నుంచి బయటపడటం మాత్రమే కాకుండా సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Evil Eye: చెడు దృష్టితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు ఎలాంటి నరదృష్టి అయినా తొలగిపోవాల్సిందే!

Evil Eye