శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈరోజున వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఎలాంటి కష్టాలు అయినా సరే వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు అని ఆయన పై నమ్మకం. వెంకటేశ్వర స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాగా వెంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి రూపాలలో ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే శనివారం రోజు చాలామంది వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.
కొంతమంది ఆలయాలకు వెళ్లి ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే శనివారం శ్రీనివాసుడిని పూజించే వారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రపరుచుకొని, దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. ముఖ్యంగా వాకిట్లో, దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలనీ చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి చిత్ర పటం లేదంటే విగ్రహం ఏది ఉంటే దానికి పువ్వులతో అలంకరించాలి.
వెంకటేశ్వర స్వామికి తులసీదళం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం పూజ సమయంలో తులసీదళాలను తప్పకుండా ఉపయోగించాలి. ఆ తర్వాత దీపాలను వెలిగించాలి. కొబ్బరికాయ పండ్లు, ఫలహారాలు సమర్పించాలి. నైవేద్యం పెట్టాలి అనుకుంటే పులిహోర,పాయసం, పండ్లు, చక్కెర పొంగలి పెట్టవచ్చని చెబుతున్నారు. అలాగే శ్రీనివాసుడి గోవింద నామాలను పఠించాలి.. ఉదయం సాయంత్రం తప్పకుండా శ్రీనివాసుడుని పూజించాలి. సాయంత్రం వేళ బియ్యపు పిండితో చేసిన ప్రమిదను వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే ఈ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగుంటే ఈ రోజు నేలపై పాడుకోవాలట. అలాగే శనివారం నాడు మద్యపానంకు దూరంగా ఉండాలట. మాంసాహారం తినకూడదట. శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామి వారి అనుగ్రహం తప్పక మీపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు.