Venkateshwara: శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో మీకు తెలుసా?

మామూలుగా మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. శనివారం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే భక్తిశ్రద్ధ

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 08:00 PM IST

మామూలుగా మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. శనివారం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే భక్తిశ్రద్ధలతో స్వామివారిని వేడుకోవడంతో పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే మరికొందరు ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటారు.. అయితే ఇంట్లో పూజ చేసేవారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఏవిధంగా పూజించాలో? ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని పూజించే భక్తులు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి. దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. ముఖ్యంగా వాకిట్లో, దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలి.వేంకటేశ్వర స్వామి చిత్ర పటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. స్వామి వారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసి దళంలో అర్చన చేయాలి. తర్వాత దీపాలను వెలిగించాలి.

తర్వాత స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు, పలారాలను సమర్పించాలి. మీరు నైవేధ్యం పెట్టాలనుకుంటే పులిహోర, పాయసం, పండ్లు, చక్కెర పొంగలి పెట్టవచ్చు. అలాగే వేంకటేశ్వర స్వామి నామాలను పఠించాలి. అలాగే శనివారం సాయంత్రం కూడా స్వామి వారిని పూజించాలి. సాయంత్రం దీపం వెలిగించి మొక్కుకోవాలి. సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెళిగిస్తే మంచిది. అలాగే ఈ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఆరోగ్యం బాగుంటే శనివారం రోజు నేలపై పడుకోవడం ఇంకా మంచిది. అలాగే శనివారం నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు. శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామి వారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.