కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి ఈ పండుగ శివకేశవులకు అంకితం చేయబడింది. ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానమాచరించి శివుడిని, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి కథ గురించి తెలుసుకుందాం..
Karthika Pournami 2025 The Full Moons Divine Glow In Karthika Masam
Karthika Pournami
కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా పాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తిసామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు. అతనికి తారక్షుకుడు, కమలాక్ష, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడనే రాక్షసుడిని జయించగలడని శ్రీమహావిష్ణువు వాళ్లకు చెబుతాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు.
Pournami
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు. ఈ కార్తీకేయుడు తారకాసురుడనే రాక్షసుడిని ఓడిస్తాడు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరిచడం ప్రారంభించారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Happy Karthika Pournami Deepa Mahotsavam
తండ్రి మరణ వార్త విని తారకాసురుడి ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు. అనంతరం ముగ్గురూ కలిసి బ్రహ్మదేవుడిని వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ ముగ్గురి తపస్సుకు మెచ్చి, వరం కోరుకోమని అంటాడు. అప్పుడు ముగ్గురూ బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు. అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెబుతాడు. అప్పుడు ఆ ముగ్గురూ బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేర్వేరు నగరాలు నిర్మించేమని కోరుతారు. అనంతరం ముగ్గురూ మొత్తం భూమి, ఆకాశంలో తిరుగుతారు. అనంతరం వెయ్యేళ్ల తర్వాత ముగ్గురూ కలుసుకుని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుకురుతారు. అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇస్తాడు.
Karthika Masam 2
ఆ వరం పొందిన ముగ్గురూ చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి 3 నగరాలను నిర్మించి ఇస్తారు. తారక్షుడికి బంగారు నగరం, కమలాక్ష కోసం వెండి నగరం, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు. ముగ్గురూ కలిసి మూడు లోకాలపై దండెత్తుంటారు. ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరతాడు. వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు. ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు. అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు.
