Vasthu Tips: ఈ వాస్తుదోషాలు.. మీ పురోగతిని అడ్డుకుంటాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

వాస్తు బాగుంటేనే మన ఇళ్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొన్ని వాస్తు లోపాలు కూడా ఉంటాయి. దీని వల్ల సంతోషకరమైన కుటుంబాల్లో విభేదాలు తలెత్తుతాయి.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 11:59 AM IST

వాస్తు బాగుంటేనే మన ఇళ్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొన్ని వాస్తు లోపాలు కూడా ఉంటాయి. దీని వల్ల సంతోషకరమైన కుటుంబాల్లో విభేదాలు తలెత్తుతాయి. కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. భార్య భర్తల సంబంధంలో ప్రేమ ఉండదు. దీనికి కారణం ఇంట్లో ఉండే కొన్ని వాస్తు లోపాలు. అవేంటో తెలుసుకుందాం.

ఇంటి గోడలపై చిత్రపటాలు.
ఇంటి గోడలపై వర్ణ చిత్రాలు పెట్టుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుళ్ల ఫొటోలు, విగ్రహాలు పెట్టకూడదు. అది వాస్తుదోషం అవుతుంది. ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకుంటే అది పెద్దదిగా ఉండకూడదు. కేవలం 1 నుంచి 3 అంగుళాల లోపు మాత్రమే ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి.

ఈ దిశలో గదిని అద్దెకు తీసుకోవద్దు
ఇంటికి ఈశాన్యం ఎత్తుగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం దిశగా మరుగు దొడ్లు నిర్మించకూడదు. ఇలా చేస్తే భారీగా నష్టపోతారు. కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ దిశ ఇతర దిశల కంటే తక్కువగా ఉంటుంది. అయితే ఈ దిశలో ఆలయం ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. ఒక గదిని అద్దెకు ఇస్తున్నట్లయితే ఈశాన్య గదిని ఇవ్వకూడదు. లోపలికి తెరుచుకునే కిటికీలు.. ఇంటి తలుపు బయటకి తెరవడం వాస్తు రిత్య మంచిదికాదు. తలుపు లోపలికి తెరవాలి. తలుపుల శబ్ధం వినపడకూడదు. కిటికీలు బయటకు కాకుండా లోపలికి తెరవడం వల్ల భయం, మానిసిక క్షోభ కలుగుతుంది. ఇంటి యజమాని ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.

గబ్బిలాలు వచ్చిన తర్వాత శుభ్రం చేయాలి.
ఇంట్లో తేనెటీగలు గూళ్లు కట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా జరిగితే ఆరు నెలల పాటు వాస్తు దోషం ఉంటుంది. కానీ గబ్బిలాలు ఇంట్లోకి ప్రవేశించిన 15 రోజుల వరకు వాస్తు దోషాలు ఉంటాయి. అలాంటి పరిస్థితిలో గబ్బిలాలు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఇంటిని శుద్ధి చేయాలి. ఎందుకంటే గబ్బిలాలు, రాబందులు, కాకులు ఇంట్లోకి ప్రవేశించడం మంచిది కాదు.

వంటగదికి సంబంధించిన వాస్తు దోషం
ఇంటి ముఖద్వారంలోకి కిచెన్ లో ఉన్న స్టవ్ కనిపించకూడదు. ఇలా ఉంటే ఇంట్లో అశాంతి నెలకొంటుంది. గృహిణి వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. రాత్రిపూట వంట పూర్తి కాగానే స్టవ్ స్లాబ్ శుభ్రం చేయాలి. ఆహారం తిన్న పాత్రలను రాత్రిపూట సింక్ లో ఉంచకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.