28th December 2022 Horoscope : డిసెంబరు 28 రాశిఫలాలు

ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి.

Published By: HashtagU Telugu Desk
Zodiac Signs

Zodiac Signs

28th December 2022 ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి:

ఈ రాశివారికి బుధవారం మిశ్రమ రోజు. ఉద్యోగులు, వ్యాపారులు విచక్షణతో పనిచేస్తే లాభం పొందుతారు. పిల్లల గురించి ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏదో భయం మీపై ఆధిపత్యం చెలాయిస్తుంది.

వృషభ రాశి:

ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త అందుకుంటారు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భూమి నిర్మాణానికి పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మిథున రాశి:

ఈ రాశివారు గలగలా మాట్లాడడం కాదు…ఎవరి ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ వ్యాపార ప్రయోజనం విజయవంతం అవుతాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లలు ఏదో విషయంలో ఆందోళన చెందుతారు.

కర్కాటక రాశి:

ఈ రాశివారికి బుధవారం శుభదినం. ఈ రాశి ప్రజలు తమ తెలివితేటలతో పనిని పూర్తి చేస్తారు. మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. శారీరక బాధలు తప్పవు. ఏదో సమస్యతో బాధపడతారు. వృధా ఖర్చులుంటాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. రిస్క్ తీసుకోవద్దు

సింహ రాశి:

బుధవారం సింహ రాశివారు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏపని అయినా ఎంత త్వరగా ప్రారంభించాలి అనుకుంటారో ఆపని ఆలస్యం కావొచ్చు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి

కన్యా రాశి:

ఈ రాశివారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది.  నష్టాన్ని నివారించాలి అనుకుంటే పనితీరు మార్చుకోవాలి. ఈ రోజు మీరు కుటుంబంలో సంతోషాన్ని పొందుతారు. విలువైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త వాహనం వచ్చే అవకాశం ఉంది.

తులా రాశి:

ఈ రాశివారు విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటారు. కంటికి సంబంధించిన నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపట్ల ఆసక్తి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు.

వృశ్చిక రాశి:

సంకుచిత భావజాలం మిమ్మల్ని వెనక్కు నెట్టేస్తోంది…కాబట్టి మీరు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. న్యాయ వ్యవహారాలు పెద్దగా కలసిరావు. లాభం వచ్చే మార్గాలను చేయిదాటిపోయేలా చేయొద్దు. జీవితభాగస్వామి  అవివేకాన్ని చూసి మీరు కలత చెందుతారు,కోపం తెచ్చుకుంటారు

ధనుస్సు రాశి:

ఈ రాశివారు  వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది, ఈ రోజు మీ పనిలో రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. జీవితభాగస్వామి కారణంగా ఆందోళన చెందుతారు. కొత్త ఆదాయ వనరుల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది.

మకర రాశి:

వ్యర్థమైన ఆందోళనను ఆపి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఆస్తి కలిసొస్తుంది. పురోగతికి మార్గం సుగమం అవుతుంది. కొన్ని విషయాల్లో అనుకూలత లేకపోవడం వల్ల నష్టాలు ఉండవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు జాగ్రత్ర.

కుంభ రాశి:

ఈ రాశి ప్రజలు టైమ్ కోసం వేచి ఉండాలి.  తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు ఫలితాన్ని మార్చగలవు…కాబట్టి ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. చర్చ కారణంగా ఇబ్బంది ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. స్నేహితులు,  సన్నిహితుల ద్వారా పనులు పూర్తిచేస్తారు.

మీన రాశి:

ఈ రాశివారు తమ మనసులోని మాటను ఎవరితోనైనా చెప్పుకోవడం మంచిది. వ్యాపారంలో కొత్త శక్తితో పనిచేస్తారు, తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది.  కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also Read;  Tirupati : తిరుపతి లో జనవరి ఒకటిన వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనం కౌంటర్లు

  Last Updated: 28 Dec 2022, 10:44 AM IST