మామూలుగా ప్రతి ఒక్కరికి సొంతింటి కల అన్నది తప్పనిసరిగా ఉంటుంది. అయితే సొంత ఇంటిని నిర్మించుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా వారికి నచ్చినట్టుగా అందంగా చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటి ప్రదాన ముఖ ద్వారం పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి మెయిన్ డోర్ పై రకరకాల డిజైన్స్ లేదంటే దేవుళ్ళ బొమ్మలను డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది మెయిన్ డోర్ పై వినాయకుడి డిజైన్ ని చేయించుకుంటూ ఉంటారు.
కొంతమంది ఇంటి ప్రధాన ద్వారానికి వినాయక డిజైన్ చేపించుకుంటే మరి కొంతమంది ఇంటిముందు వినాయకుడి బొమ్మ లేదంటే ఫోటోనే ఉంచుతూ ఉంటారు. మరి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రధాన ద్వారం పై వినాయకుడు ఉండవచ్చా అలా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుడి బొమ్మను ఉంచడం వల్ల కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందట. ఇలా చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం. మెయిన్ డోర్ పై ఫోటో పెట్టడం, లేదా మెయిన్ డోర్ పై దేవుడి రూపం ఉన్నా కూడా ఇంట్లోకి నెగెటివిటీ రాదట. ఇంట్లో అంతా సానుకూలంగానే ఉంటుందట. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందట.
అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి కలిగిస్తుందట. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా పని జరుగుతుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా పని జరుగుతాయట.