Holi 2024: హోలీ పండుగ రోజు ఏఏ దేవుళ్లను పూజించాలో మీకు తెలుసా!

హిందూ మతంలో పెద్ద పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది హోలీ పండుగ మర్చి 25 న వచ్చింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 06:40 PM IST

హిందూ మతంలో పెద్ద పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది హోలీ పండుగ మర్చి 25 న వచ్చింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇతర పండుగల్లో మాదిరిగానే హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నింటిలో మొదటిది రంగు లేదా గులాల్ దేవునికి మొదటగా పూస్తారు. ఆ తర్వాత మాత్రమే హోలీని ఒకరికి ఒకరు రంగులను అడ్డుకుంటూ రంగుల కేళీ ఆడతారు. హోలీ రోజున ఈ దేవతలను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. మరి ఈ హోలీ పండుగ రోజున ఏ దేవుళ్ళను పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హోలీ రోజున హనుమంతుడిని పూజించడం విశిష్టంగా భావించాలి.

హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శారీరక, దైవిక, భౌతిక వేడి నుండి ఉపశమనం పొందుతారు. హోలీ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల జీవితాల్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. హోలీ సందర్భంగా పురాతన క్షేత్రం కాశీలో భక్తులు రంగులు, గులాల్‌తో పాటు స్మశానంలో బూడిదతో హోలీని జరుపుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ‘మసానే హోలీ’ అని కూడా పిలుస్తారు. ఇందులో తన భూతగణాలతో హోలీ ఆడటానికి శివయ్య స్వయంగా వస్తాడని నమ్మకం. అందుకే హోలీలో మహాదేవుని పూజించే సంప్రదాయం ఉంది. శివుడిని ఆరాధించడం ద్వారా అన్ని సమస్యల నుండి ఉపశమనం పొంది ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. రాధా-కృష్ణుల ఆరాధన లేకుండా హోలీ పండుగ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

హోలీ సందర్భంగా మధుర-బృందావన్‌తో సహా మొత్తం బ్రజ్‌లో హోలీని ఘనంగా జరుపుకుంటారు. హోలీ రోజున రాధా-కృష్ణులను పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లబీస్తాయి. అంతేకాకుండా కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున ఖచ్చితంగా శ్రీ రాధా కృష్ణుడిని పూజించాలి. ఇది జీవితంలో ప్రేమను తీసుకురావడమే కాకుండా ప్రేమ సంబంధాన్ని బలంగా ఉంచుతుంది. అలాగే హోలీ రోజున లక్ష్మీ దేవి ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హోలీ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అంతే కాదు ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనం జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని దహనం చేయడానికి హోలిక తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుంది. అగ్నిలో కూర్చొని ఉంది. అయితే ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. హోలిక బూడిదైంది. హోలీ పండుగ విష్ణువు నరసింహ అవతారానికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున విష్ణువును పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.