Site icon HashtagU Telugu

Holi: హాలి పండుగ రోజు ఈ వస్తువులు దానం చేస్తే.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లే?

Mixcollage 20 Mar 2024 07 54 Pm 7331

Mixcollage 20 Mar 2024 07 54 Pm 7331

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను కులం మతం పేద ధనిక అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండగ తెలంగాణలోనైతే ఏడు రోజుల ముందే ప్రారంభమవుతుంది. దీనినే కొంతమంది కాముడు పండగ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం పాల్గుణ మాసంలోని, పౌర్ణమి తర్వాతి రోజున ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో నైతే హోలీ పండగకి ముందు రోజు కాముడు దహనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అయితే ఈ సంవత్సరం కాముడి దహనం మార్చి 24వ తేదీ అర్ధరాత్రి జరగబోతోంది. ఆ తర్వాతి రోజే మార్చి 25వ తేదీన హోలీ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈరోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, డబ్బు తొలగిపోతాయని పురాణాల్లో తెలిపారు. అయితే హోలీ పండగ రోజు ఏయే వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. హోలీ పండుగ రోజున వివాహ స్త్రీలకు అలంకరణ వస్తువులను దానం చేయకూడదు.

ముఖ్యంగా ఈ రోజు స్త్రీలకు బొట్టు బిళ్ళలు, పెర్ఫ్యూమ్, గాజులు, పౌడర్‌తో పాటు ఇతర వస్తువులను అస్సలు దానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాముడు దహనం చేసిన తర్వాత డబ్బును అస్సలు దానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ దానం చేస్తే ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. హోలీ పండగ రోజున బట్టలు దానం చేయడం కూడా ఆశుభం కలుగుతుందని పూర్వీకులు నమ్మకం. ఇలా దానం చేయడం వల్ల ఇంట్లో దరిద్రం మొదలవుతుందని పురాణాల్లో తెలిపారు. అంతేకాకుండా కుటుంబంలో అశాంతి వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు కూడా రావచ్చు. ఈరోజు ఇనుప ఉక్కు వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇనుప గిన్నెలలో పాలు పెరుగు పంచదార మొదలైన తెలుపు రంగు కూడిన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుడు స్థానం బలహీన పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఆవనూనెను దానం చేయడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నూనెను దానం చేయడం వల్ల శని దేవుడి ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా వ్యక్తిగత జీవితంలో మానసిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

హోలీ పండుగ రోజున గాజు గ్లాసులను కూడా ఎవరికి బహుమతి ఇవ్వకూడదని పురాణాల్లో పేర్కొన్నారు. దీనివల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.హోలీ పండగ రోజున తెలుపు రంగు వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం కాదు. ముఖ్యంగా పాలను దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుడు బలహీనపడి వ్యక్తుల జీవితాల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు కొన్ని రంగులకు సంబంధించిన వస్తువులను కూడా దానం చేయడం శుభప్రదం కాదు. కాబట్టి హోలీ పండుగ రోజు దానధర్మాలు చేయడం మానుకోవాలి.

Exit mobile version