ప్రతి ఏడాది పాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ హోలీ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా రంగులు చల్లుకుంటూ నీళ్లు చల్లుకుంటూ చాలా సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు హోలిక దహనాన్ని జరుపుకుంటారు. అలాగే ఈ హోలీ పండుగ రోజున దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. హోలీ రోజున దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని, అంతా మంచి జరుగుతుందని నమ్మకం. అయితే జీవితంలోని అడ్డంకులు అన్నీ తొలగిపోయి మంచి జరగాలి అంటే హోలీ పండుగ రోజున ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది అన్న విషయానికొస్తే.. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిధి మార్చి 13న ఉదయం 10:35 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిధి మార్చి 14న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో హోలికా దహనాన్ని మార్చి 13న నిర్వహిస్తారు. హోలీ పండగను మార్చి 14న జరుపుకుంటారు. ఇకపోతే ఎవరు ఏమేమి దానం చేయాలి అన్న విషయానికి వస్తే..
మేష రాశి వారు.. హోలీ రోజున గోధుమ, రాగి, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించవచ్చట.
వృషభ రాశి వారు.. ఈ హోలీ పండుగ రోజున వెండి, బెల్లం, తెల్లని వస్త్రాలను దానం చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట.
మిధున రాశి వారు ఈ పండుగ రోజున ఆకుపచ్చ రంగు వస్తువులు పెన్నులు పుస్తకాలు వంటి విధానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.
ఇక కర్కాటక రాశి వారు హోలీ పండుగ రోజున పాలు బియ్యం, తెల్లని పువ్వులు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు.
కాగా సింహ రాశి వారు ఈరోజు నా బంగారం కుంకుమ నారింజ వంటి పనులను దానం చేయడం వల్ల ఈ రాశి వారి గౌరవం పెరుగుతుందట.
కన్య రాశి వారు హోలీ రోజున తేనె, రాగి, ఆకు పచ్చని పండ్లను దానం చేయాలట. ఇలా చేస్తే అది జీవితంలో ఆనందం, శాంతిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు..
అలాగే తులా రాశి వారు హోలీ పండుగ రోజున, వెండి గులాబీ పువ్వులు, తెల్ల వస్త్రాలను దానం చేయడం వల్ల జీవితంలో మంచి విజయం లభిస్తుందట.
వృశ్చిక రాశి వారు ఈ రోజున రాగి, పెసలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేస్తే విజయానికి మార్గాన్ని తెరుస్తుందట.
ఇక ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు పసుపు అలాగే ఉసిరి వంటివి దానం చేయడం వల్ల పురోగతి కలుగుతుందట.
మకరరాశి వారు ఈ రోజున అన్న దానం, వస్త్ర దానం చేయాలట. ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుందట.
అలాగే కుంభ రాశి వారు ఈ రోజున రాగి, నీలం రంగు దుస్తులు, అన్నం దానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇది అడ్డంకులను తొలగించి వ్యాపారాలలో లాభాలను అందుకునేలా చేస్తుందట.
మీన రాశి వారు హోలీ రోజు తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలను తెస్తుందట.