Site icon HashtagU Telugu

Tirupati Laddu: శ్రీవారి ల‌డ్డూల వెనక ఉన్న ఈ ర‌హ‌స్య స్టోరీ తెలుసా..?

Tirupati Laddu

Tirupati Laddu

Tirupati Laddu: తిరుపతి బాలాజీ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. తిరుపతి వేంకటేశ్వర ఆలయంలోని ప్రసాదం (Tirupati Laddu)లో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి మరింత చర్చనీయాంశమైంది. పరీక్ష నివేదిక ప్రకారం ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత‌, రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రకటించించారు. అప్ప‌ట్నుంచి ఈ విష‌యం దేశ‌మంత‌టా హాట్ టాపిక్‌గా మారింది.

లడ్డూల నైవేద్యానికి గల ప్రాముఖ్యత ఏమిటి?

అయితే తిరుపతి బాలాజీ ఆలయంలో లడ్డూలు నైవేద్యంగా పెట్టడంపై ఉన్న విశ్వాసం ఏమిటో తెలుసా..? తిరుపతి బాలాజీ ఆలయంలో మొదటగా లడ్డూలను ఎవరు సమర్పించారో తెలుసా..? ఈ పై ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానం తెలుసుకుందాం. వాస్తవానికి భక్తులు తమ కోరికలతో వచ్చి త‌మ ఇష్ట దైవానికి చెప్పుకుంటారు. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు బంగారం, వెండి, డబ్బు, పండ్లు, అనేక ఇతర వస్తువులను ఇక్కడ కానుక‌గా హుండీలో వేస్తారు. తిరుపతి బాలాజీ ఆలయంలో వేంకటేశ్వరునికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం భగవంతుని ఆరాధనగా కనిపిస్తుంది. ఈ లడ్డూలను ఆధ్యాత్మికత, భక్తికి చిహ్నంగా భావిస్తారు.

Also Read: Pitru Paksha: పితృ పక్షంలో ఈ వస్తువులను దానం చేయండి..!

ముందుగా ప్రసాదం ఇచ్చింది ఎవరు?

కొండపై బాలాజీ స్మావివారి విగ్రహాన్ని స్థాపించినప్పుడు పూజారులు వెంకటేశ్వర స్వామికి ఏమి సమర్పించాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒక వృద్ధురాలు చేతిలో లడ్డూతో అక్కడికి వచ్చి ఇది తీసుకో ఈ ప్రసాదం దేవుడికి చాలా ఇష్టం అని చెప్పింది. అప్పటి నుంచి దేవుడికి లడ్డూలు నైవేద్యంగా పెడుతున్నారు. లడ్డూల నైవేద్యాన్ని లక్ష్మీదేవి స్వయంగా సూచించిందని నమ్ముతారు. అయితే ఇప్పుడు ఈ ల‌డ్డూల్లో జంతువుల కొవ్వు, చేప నూనె వాడార‌ని తెలిసి భ‌క్తులు సైతం గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా వెంక‌టేశ్వ‌ర స్వామి ల‌డ్డూల‌కు ఉన్న ప్రాముఖ్య‌త ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. తిరుమ‌ల వెళ్లిన ప్ర‌తి భ‌క్తుడు ల‌డ్డూ లేకుండా ఇంటికి తిరిగి వెళ్ల‌డు అంటే అర్థం చేసుకోవ‌చ్చు ఆ స్వామి ల‌డ్డూ విశిష్ట‌త‌.