Bakri Eid 2022: బక్రీద్ రోజు గొర్రెపిల్లను ఎందుకు బలిస్తారో తెలుసా..?

రంజాన్ తర్వాత రెండు నెలలకు బక్రీద్ వస్తుంది. త్యాగానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు ముస్లీంలు. ఈ పండగను ఈ ఏడాది జూలై 10న జరుపుకుంటారు.

  • Written By:
  • Publish Date - July 10, 2022 / 05:00 AM IST

రంజాన్ తర్వాత రెండు నెలలకు బక్రీద్ వస్తుంది. త్యాగానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు ముస్లీంలు. ఈ పండగను ఈ ఏడాది జూలై 10న జరుపుకుంటారు. ఈ బక్రీద్ పండుగనే ఖుర్బీనాపండుగా లేదా ఈద్ అల్ -అధా అని పిలుస్తారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలల్లో ఇది ఒకటి.

బక్రీద్ ప్రాముఖ్యత…
ప్రవక్త ఇబ్రహీం తన కొడుకు ఇస్మాయిల్ ను కత్తితో మెడను కోస్తున్నట్లుగా ఒక రోజు కళ వస్తుంది. ఆ అల్లాహ్ తన కొడుకునే కోరుతున్నాడేమోనని భావించి…తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్దపడుతాడు. ఇబ్రహాం త్యాగాన్ని మెచ్చిన అల్లాహ్..ప్రాణత్యాగం వద్దని ఏదైనా జీవిని బలి ఇవ్వాల్సిందిగా కోరతాడు. ఇబ్రహీం భక్తికి త్యాగానికి గుర్తుగా ఆయనను సత్కరించేందుకే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ బక్రీద్ ను జరుపుకుంటారు. ఈ పండుగ ముందు రోజు ముస్లింలంతా తమ పెద్దల సమాధుల వద్ద వారికి ఇష్టమైన ఆహారపదార్థాలను, బట్టలను ఉంచుతారు. స్వర్గం నుంచి తమ పెద్దలు వాటిని స్వీకరిస్తారని వారి నమ్మకం.

గొర్రెను ఎందుకు బలి ఇస్తారు…
ఇబ్రహీం భక్తితో అల్లాహ్ కు తన కొడుకును బలిస్తుంటే…అల్లాహ్ జోక్యం చేసుకుని కొడుకు స్థానంలో గొర్రెపిల్లను బలి ఇచ్చాడని పురాణాల్లో ఉంది. ఆ సమయంలో ఇబ్రహీం తన కొడుకునే బలి ఇస్తున్నట్లుగా భావిస్తాడు. కానీ అల్లామ్ మహిమతో బలి అయ్యేది గొర్రెపిల్ల. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అల్లాహ్ కు గొర్రెపిల్లను బలిస్తారు.

ఇక అల్లాకు నైవేద్యం సమర్పించిన తర్వాత గొర్రెపిల్లను మూడు భాగాలుగా కట్ చేసి కొంత భాగం కుటుంబానికి ఇంకొంత భాగం స్నేహితుకలు ఇంకొంత భాగం పేదలకు పంచిపెడతారు. ఈ మాంసంతో మటన్ కీమ, మటన్ కుర్మా, మటన్ బిర్యానీ , షీర్ కుర్మా వంటి వంటకాలు చేస్తారు.