Site icon HashtagU Telugu

Naga Panchami: నాగపంచమి విశిష్టత ఏమిటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Nagula Chavithi 2024

Nagula Chavithi 2024

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో నాగుల చవితి కూడా ఒకటి. ఈ నాగుల చవితి పండుగ రోజున ఇంట్లోనే చిన్నపిల్లలు పెద్దలు అందరూ నాగుల కట్ట దగ్గరికి లేదంటే పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోసి చలివిడి వంటివి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ నాగపంచమని ఎందుకు జరుపుకుంటారు? ఈ పండగ విశిష్టత ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఏడాది అనగా 2024 లో ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రోజున నాగపంచమి వేడుకలు జరుపుకోనున్నారు. శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగులు పంచమిగా హిందువులు జరుపుకుంటారు.

స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమ శివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఒక వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్బవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారు. ఈ విధంగా నాగపంచమి రోజున నాగసర్పాలను పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయిట. నాగ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలట. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకుంటారు.

నాగ పంచమి రోజున నాగులను పూజించిన వారికి విష బాధలు ఉండవని చెబుతున్నారు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవని చెబుతున్నారు. ఈ సంతానం లేని వారు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుందని చెబుతున్నారు. అలాగే నాగపంచమి రోజున పూజలు చేయడం వల్ల కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయట. నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.

సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయట. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకలసంపదలు కలిగి, రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. నాగ పంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయని చెబుతున్నారు పండితులు.