ఇవాళ విజయదశమి సందర్భంగా దుబాయ్ లో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. జెబెల్ అలీలో నిర్మించిన నూతన హిందూ దేవాలయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. పురాతన హిందూ దేవాలయంలో ఒకటైన సిందీ గురు దర్బార్ ఆలయానికి పొడిగింపు ఈ దేవాలయం. ఈ ఆలయం దసరా రోజున అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు గల్ఫ్ న్యూస్ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అన్ని మతాల వారిని ఆహ్వానిస్తున్నారు. ఒకే కమ్యూనిటీలో యూఎఈలో ఇదే మొదటిది. ఈ ఆలయం రాబోయో కాలానికి సూచించే సంప్రదాయానికి ప్రతీక అని దేవాస్ధానం రిలీజ్ చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ ఆలయం ప్రత్యేకత:
ఈ ఆలయంలో 16 దేవుళ్లు కొలువై ఉన్నారు. వినాయకుడు శ్రీ కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయురప్న్, అయ్యప్ప, శివుడు వంటి మొత్తం 16 హిందూ దేవుళ్లతోపాటు గురు గ్రంథ్ సాహిబ్ ను ప్రతిష్టించినట్లు భారత రాయబారి సంజయ్ తెలిపారు. ఈ ఆలయంలో నిత్యం పూజలందించేందుకు 8మంది పూజారులను నియమించారు.
ఇక ఈ ఆలయంలోని ప్రధాన హాలులో ఏర్పాటు చేసి పెద్ద 3డి ప్రింటెండ్ గులాబీ కమలం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మరింత సమాచారం కోసం http://hindutempledubai.com ను సందర్శించవచ్చు. క్యూఆర్ కోడ్ తో అపాయింట్ మెంట్ బుకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.
ఆరు దశాబ్దాల క్రితం మొదటి ఆలయం:
దుబాయ్‌లో దాదాపు 64 ఏళ్ల క్రితం హిందూ దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ బర్ దుబాయ్‌లో ఉన్న ఆ ఆలయంలో శివుడు, కృష్ణుడు ప్రతిష్టించారు. ఇప్పుడు నిర్మించిన ఆలయమే పెద్దది. ఈ ఆలయంలో బ్రహ్మదేవుడికి ప్రత్యేక గది ఉంది. మొదటి అంతస్తులో 4,000 చదరపు అడుగుల హాలలో అనేక మతపరమైన సామాజిక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఆలయంలో వివాహాలు, ప్రైవేటు ఈవెంట్లు చేయడానికి సౌకర్యాలనూ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఆలయం ఉదయం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. , అక్టోబర్ చివరి నాటికి, ఆలయాన్ని సందర్శించడానికి అపాయింట్‌మెంట్‌లు ఇప్పటికే నిండిపోయాయి. అక్టోబర్ 5 నుండి, వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నవారు దర్శనం చేసుకోనున్నారు.