Site icon HashtagU Telugu

Coconut: కొబ్బరికాయకు మూడు కన్నులు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

Mixcollage 10 Jun 2024 11 03 Am 9244

Mixcollage 10 Jun 2024 11 03 Am 9244

హిందూమతంలో కొబ్బరికాయ చాలా పవిత్రమైనది. ఎలాంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు. కొబ్బరికాయ త్రిమూర్తుల స్వరూపం అని.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తారని భక్తుల నమ్మకం. కొబ్బరి నీళ్లను ఇంట్లో చల్లడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి అని విశ్వాసం. హిందూ సనాతన ధర్మంలో నమ్మకం ప్రకారం కొబ్బరికాయపై ఉండే మూడు కనులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలకు సంబంధించినవిగా ప్రజలు భావిస్తారు.

ఈ కొబ్బరికాయను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ కొబ్బరికాయ కు ఒక కథ కూడా ఉంది. ఒకసారి శ్రీ మహా విష్ణువు లక్ష్మిదేవితో కలిసి భూమిపైకి వచ్చారు. అప్పుడు లక్ష్మిదేవి కూడా తనతో పాటు కామధేనువు, కొబ్బరి చెట్టును భూమికి తీసుకువచ్చింది. మరొక నమ్మకం ప్రకారం భూమిపై పురాతన కాలంలో మానవులను, జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది. ఈ బలి కార్యక్రమాన్ని ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు.

ఎందుకంటే కొబ్బరికాయ రూపం మానవుని వలె పరిగణించబడుతుంది. కొబ్బరికాయను మనిషి పుర్రెతో పోలుస్తారు. అంతేకాదు కొబ్బరి పీచు పిలక.. మనిషి వెంట్రుకలా ఉంటుంది. దీంతో ఏదైనా ఆచార, సాంప్రదాయ వ్యవహారాల్లో జంతువులను లేదా మానవులను బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు. ఇవే కాకుండా ఇంకా కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.